
పేద ప్రజలకు వైద్య సేవలు అందించడమే రోటరీ క్లబ్ లక్ష్యం… రోటరీ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు
పేద ప్రజలకు వైద్య సేవలు అందించడమే రోటరీ క్లబ్ లక్ష్యం… రోటరీ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు
ధర్మవరం (పల్లెవెలుగు) పేద ప్రజలకు వైద్య సేవలు అందించడమే రోటరీ క్లబ్ లక్ష్యమని అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణమూర్తి, రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం పట్టణంలోని సాంస్కృతిక మండలిలో రోటరీ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో ఆ క్యూ ప్రెషర్ వైబ్రేషన్ అండ్ మ్యాగ్నెటిక్ తెరఫీ ఉచిత వైద్య శిబిరమును సాంస్కృతిక మండలి లో జ్యోతి ప్రజ్వలను క్యాంపు చైర్మన్లు సత్రశాల ప్రసన్నకుమార్, రత్న శేఖర్ రెడ్డి, డాక్టర్ శర్మాలచే ప్రారంభం కావడం జరిగింది. తదుపరి అధ్యక్ష కార్యదర్శులు కృష్ణమూర్తి, రామకృష్ణ, కోశాధికారి జయసింహలు మాట్లాడుతూ ఈనెల రెండవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు వారం రోజులు పాటు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిర్వహించబడునని తెలిపారు. క్యాంపు చైర్మన్ గా సత్రశాల ప్రసన్న కుమార్ ,క్లబ్బు జిల్లా గవర్నర్ రత్నశేఖర్ రెడ్డిలు వ్యవహ రించడం పట్ల వారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. రాజస్థాన్ డాక్టర్ ఆర్కె శర్మ, వారి శిష్య బృందం ఉదయం 83 మందికి సాయంత్రం 40 మందికి వైద్య చికిత్సలను అందజేశా రన్నారు. రక్తపోటు, చక్కర వ్యాధి, థైరాయిడ్, కడుపు నొప్పులు, గ్యాస్ట్రిక్ ట్రబుల్, మలబద్ధకం, వెన్నునొప్పి, తలనొప్పి, కీళ్ల నొప్పులు, ఆస్తమా, చికెన్ గున్యా ,కన్ను, గొంతు, చెవి సమస్యలు తదితరులు అన్నీ కూడా ఉచితంగా వైద్య చికిత్సలను అందజేశారని తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి ఈ శిబిర నిర్వహణ పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. పేద ప్రజలకు ఇటువంటి సేవలు చేయడం కేవలం రోటరీ క్లబ్కే సాధ్యము అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్బు ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి తో పాటు బండారు చలం, రమేష్ బాబు, శ్రీనివాసుల రెడ్డి, ఉట్టి నాగరాజు, జయచంద్ర,శివయ్య, ఓ.వీ. ప్రసాద్ ,మనోహర్ గుప్తా, సుదర్శన్ గుప్తా లు పాల్గొన్నారు.