mantralayam

పేదలందరికీ ఇళ్లు

  • పేదలందరికీ ఇళ్లు
  • వేగవంతంగా కొనసాగుతున్న ఇళ్ల నిర్మాణాలు.
  • జగనన్న కాలనీల్లో నూతనంగా నిర్మించిన మొదటి ఇంట్లోకి గృహ ప్రవేశం చేసిన పెద్దాయన వై. సీతారామిరెడ్డి.

మంత్రాలయం (పల్లెవెలుగు) 05 ఆగష్టు: రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాల్లో పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో గతేడాది ఇంటి పట్టాలు మంజూరు చేయగా గత కొద్ది రోజుల క్రితం నెల్లూరుకి చెందిన జె.ఎన్. ఆర్ సంస్థ ఆధ్వర్యంలో 500 ఇళ్లకు భూమి పూజ చేసిన విషయం అందరికీ తెలిసిందే. గురువారం మంత్రాలయం లోని ఎమ్మిగనూరు రహదారి లో ఉన్న జగనన్న కాలనీల్లో నూతనంగా త్రీవేణి, ప్రవీణ్ దేశాయి నిర్మించిన  ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దాయన ఎమ్మిగనూర్ వై. సీతారామిరెడ్డి అన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన ఇంట్లో నిర్వహించిన సత్యనారాయణ వ్రతం, హోమంలో పాల్గొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం లబ్ధిదారులు ప్రవీణ్ దేశాయ్ పెద్దాయన వై. సీతారామిరెడ్డి అన్న కి శాలువ కప్పి సన్మానించారు. ఈయనతో పాటు ఎస్ఐ వేణు గోపాల్ రాజ్, సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, నాయకులు జనార్దన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

B veeresha

B.Veeresha Reporter pedda kadubur, Kurnool Dist
Back to top button