
పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
నంద్యాల (పల్లెవేలుగు) 04 నవంబర్: అలనాటి జ్ఞాపకాలు ఎప్పటికీ మధురస్మృతులేనని 1982-83 నాటి యస్.పి.జి. హైస్కూల్ నందు విద్యనభ్యసించిన విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా పేర్కొన్నారు. ఈ రోజు తమ పాఠశాల ఆవరణంలో కూడిన పలువురు మిత్రులు తమకు విద్యభొదించిన ఉపాధ్యాయులను, నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆనాటి మరపురాని మధురమైన సంఘటనలు చిలిపి చేష్టలను గుర్తుకు తెచ్చుకుని ఆద్యంతం ఉల్లాసంగా, సంతోషంగా గడిపారు. ఈ పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో విద్య, వైద్య, న్యాయ, బ్యాంకింగ్, రాజకీయ, దేశ రక్షణ వంటి వృత్తుల్లో, ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో స్థిరపడిన వారుండటం విశేషం. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో మిత్రులు దాసరి చింతలయ్య, రామసుబ్బయ్య, లలితా సరస్వతి, అగస్టీన్, సుమన్, మాధవీలత, జోసెఫ్, మురళి, రూబీ, గోవింద రెడ్డి, కెజియ, పద్మ, అర్జున్ రెడ్డి, చెన్నమ్మ, పరమేశ్వర రెడ్డి మొదలగు వారు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.