
పుట్టపర్తి సత్యసాయి బాబా జన్మదిన వేడుకలు
పుట్టపర్తి సత్యసాయి బాబా జన్మదిన వేడుకలు
ధర్మవరం (పల్లెవెలుగు) 23నవంబర్: పట్టణంలోని కాగితాల వీధిలో గల ప్రణవసాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ప్రిన్సిపాల్ కృష్ణ కిషోర్ ఆదిలక్ష్మిలా ఆధ్వర్యంలో విద్యార్థులు తల్లిదండ్రుల నడుమ పుట్టపర్తి సత్యసాయిబాబా వారి 97వ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా సత్యసాయి బాబా చిత్రపటానికి వివిధ పూలమాలలతో చక్కగా అలంకరించిన వైనం అందరిని ఆకట్టుకుంది. అనంతరం కేకు కట్ చేసి వారు దేశానికి చేసిన సేవలను కొనియాడారు. అదేవిధంగా పట్టణంలోని లయోలా ఇంగ్లీష్, తెలుగు మీడియం ఉన్నత పాఠశాలలో కూడా సత్యసాయి బాబా జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అక్కడ కూడా బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి సత్యసాయి భజనలను చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శంకర్ నారాయణ, పాఠశాలల విద్యార్థులు ,జిల్లా బాలవికాస్ కోఆర్డినేటర్ ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తదుపరి మండల పరిధిలోని పోతుల నాగేపల్లి మండల ప్రాథమికోన్నత పాఠశాల లో సత్య సాయి బాబావారి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ఆ గ్రామ వీధుల్లో ర్యాలీని నిర్వహించి సత్యసాయి సేవా సంస్థ గ్రామములో చేసిన సేవా కార్యక్రమాలను వివరించారు. అనంతరం విద్యార్థులకు స్వీట్ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఉపాధ్యాయ సంఘం జిల్లా కోశాధికారి అన్నం అరవింద్ ఉపాధ్యాయులు రమేష్ చలపతి జయప్రద సచివాలయ సిబ్బంది గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు.