
nandyala
పాత్రికేయులపై దాడిని ఖండించిన – SDPI
- పాత్రికేయులపై దాడిని ఖండించిన – SDPI
- బాధిత పాత్రికేయులను పరామర్శించిన – SDPI నంద్యాల అసెంబ్లీ అధ్యక్షులు అబ్దుల్ కలాం
నంద్యాల (పల్లెవేలుగు) 07 నవంబర్: పట్టణంలోని గాంధీ చౌక్ కూరగాయల మార్కెట్లో శనివారం రాత్రి జరిగిన ఒక సంఘటనలో కొంతమంది వ్యక్తులు విధి నిర్వహణలో ఉన్న విలేకరులపై దాడి చేయడం సమంజసం కాదని ఏమైనా విలేకరుల వల్ల వారికి ఏమన్నా ఇబ్బందికరంగా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప చట్టాన్ని చేతుల్లో తీసుకొని భౌతిక దాడులు దిగడం మంచి పద్ధతి కాదని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పాత్రికేయులను పరామర్శించిన వారిలో SDPI నంద్యాల అసెంబ్లీ కార్యవర్గ సభ్యులు అబ్దుల్ మజీద్ , జూలేపల్లి గ్రామ వార్డు మెంబర్ అబ్దుల్ సలాం , అత్తర్ హుస్సేన్ , ముల్లా ఇస్మాయిల్ పరామర్శించారు