Allagadda

పాత్రికేయుని పరామర్శించిన కర్నూల్ నంద్యాల ఉమ్మడి జిల్లాల బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసులు

  • పాత్రికేయుని పరామర్శించిన కర్నూల్ నంద్యాల ఉమ్మడి జిల్లాల బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసులు

  • ఆంధ్ర ప్రభ సంక్షేమ నిధినుండి తక్షణ ఆర్థిక సహాయం

  • కృతజ్ఞతలు తెలిపిన పాత్రికేయుని కుటుంబ సభ్యులు

  • ప్రతి పాత్రికేయుని వెన్నంటి ఉంటాం

  • నిత్యం ప్రజాసేవలో ఉంటాం

చాగలమర్రి (పల్లెవేలుగు) డిసెంబర్ 12, మండల కేంద్రమైన చాగలమర్రి ఆంధ్ర ప్రభ రిపోర్టర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుచున్న వరికూటి చెన్నకేశవన్ ను సోమవారం ఆంధ్ర ప్రభ కర్నూల్, నంద్యాల ఉమ్మడి జిల్లాల బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసులు పరామర్శించారు. ఆంధ్ర ప్రభ సంక్షేమ నిధి నుండి తక్షణ సహాయంగా 15 వేల రూపాయలు నగదును ఆంధ్ర ప్రభ నంద్యాల పిసి ఇంచార్జి నాగేంద్ర, బ్యూరో రాజశేఖర్ రెడ్డి లు చెన్నకేశవ కు అందచేశారు. ఈ సందర్బంగా బి యం శ్రీనివాసులు మాట్లాడుతూ ఆంధ్ర ప్రభ యాజమాన్యం పత్రికా రంగంలో విధులు నిర్వహిస్తున్న పాత్రికేయుల పట్ల ఎంతో శ్రద్ధ వహించి ఆంధ్రప్రభ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి ఆపదలో ఉన్నవారిని ఆదుకొనుటకు సంక్షేమ నిధి నుండి ఆపన్న హస్తంతో ఆదుకొనే సంస్థ ఆంధ్ర ప్రభ అని అన్నారు. ప్రభలో పనిచేసే ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులన్నారు. భారత రాజ్యాంగంలో ఫోర్త్ ఎస్టేట్ జర్నలిస్ట్ అని అన్నారు. ఎన్ని సంక్షేమ పతకాలు అందరికి ఉన్న జర్నలిస్ట్ సంక్షేమం కోసం సహకరించే వారు తక్కువ అన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఆంధ్ర ప్రభ తన సంస్థలో పని చేసే వారిని కన్న బిడ్డలవలే కాపాడుకొంటూ ఉందన్నారు. పాత్రికేయులపై అక్రమకేసులు బనాయించిన, బెదిరించిన, ఊరుకునేది లేదన్నారు. ఈయన వెంట వివిధ మండలాల విలేకరులు ఉన్నారు. కృతజ్ఞతలు తెలిపిన పాత్రికేయుని కుటుంబ సభ్యులు తక్షణ ఆర్థిక సహాయం అందించి, ఆసుపత్రి చికిత్సకు పూర్తి స్థాయి సహకరించి ఆడుకుంటామని, ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, వెన్నంటీ వుండి ఆదుకుంటామని హామీ ఇచ్చిన బ్రాంచ్ మేనేజర్ కు, ఆంధ్రప్రభ, యాజమాన్యానికి, ప్రభ యాజమాన్యానికి, ప్రభ పాత్రికేయులకు పాత్రికేయుడు చెన్నకేశవన్, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

sridhar

Sridhar Allagadda, Reporter, Nandyal Dist.
Back to top button