
పాణ్యం లో ఘనంగా నిర్వవహించిన 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
పాణ్యం లో ఘనంగా నిర్వవహించిన 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
పాణ్యం (పల్లెవెలుగు) 26 గురువారం మండల పరిధిలో పలు ప్రభుత్వ కార్యాలయాల వద్దు 74వ ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు, అనంతరం మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ ఓకే దేశం ఓకే రాజ్యాంగం అని డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ కల సాకారం, అన్నారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గగ్గుటూరు గ్రామంలో సర్పంచ్ సద్దల పద్మావతి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1947 ఆగస్టు 15లో స్వతంత్ర వచ్చింది 1950 జనవరి 26 రాజ్యాంగo అమల్లోకి వచ్చింది కాబట్టి ఈ రోజు మనం రాజ్యాంగ దినోత్సవంగా యావత్తు భారత దేశంలో ఇది జాతీయ పండుగ గా జరుపుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది నేను సర్పంచ్ గా ఉన్నని రోజులు ప్రతి చిన్న సమస్య నాదృష్టి కి తీసుకుని రావాలని పిలుపునిచ్చారు, గ్రామంలో అర్హత ఉండి ఏ పథకమైన రాకపోతే తమ దృష్టికి తీసుకువెళ్తే పై అధికారులతో మాట్లాడి లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా కృషి చేస్తామన్నారు, వివిధ కారణాలవల్ల నవరత్న పథకాలు మరియు ఇతర పథకాలు రాకపోయినట్లయితే ,కొత్తగా హౌస్ హోల్డ్ స్ప్లిట్ ఆప్షన్ వచ్చినందువలన ప్రజలందరూ ఈ ఆప్షన్ను సద్వినియోగం చేసుకోని లబ్ధి పొంది, ప్రభుత్వానికి అండగా ఉండాలని ఆమె కోరారు, ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం, అంగన్వాడి టీచర్, విద్యార్థులు ,గ్రామ ప్రజలు, వాలంటీర్స్, చిన్న సిద్ధప్ప మరియు గ్రామ కార్యదర్శి వేణుగోపాల్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్నిజయప్రదం చేశారు