panyam

పాణ్యం పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి

పాణ్యం పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి

నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి , తనిఖీలలో భాగంగా నంద్యాల సబ్ డివిజన్ పరిదిలోని పాణ్యం పోలీస్ స్టేషన్ లో దస్త్రాల రికార్డ్స్ తనిఖీ చేశారు.

పాణ్యం ,పల్లెవెలుగు 24,11,2022,గురువారం పాణ్యం పోలీస్ స్టేషన్ కు నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి రాగానే నంద్యాల డిఎస్పి సి.మహేశ్వర్ రెడ్డి పాణ్యం సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.వెంకటేశ్వర రావు స్వాగతం పలికారు.
అనంతరం పాణ్యం ఎస్సై పి.సుధాకర్ రెడ్డి నుండి గౌరవ వందనం స్వీకరించారు.
ఆయన పాణ్యం పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్ లోని స్టేషన్ లోని క్రైమ్ రికార్డ్స్ ను, కేసు డైరీ మరియు రిజిస్టర్ లను క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్ కు వచ్చే ఫిర్యాదిదారుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని చట్ట పరిధిలో సత్వర న్యాయం జరిగేలా కృషి చేయాలని ఆదేశించారు. సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
మహిళ పోలీసులతో మాట్లాడి వారికి కేటాయించిన గ్రామాలలో మహిళపై జరుగుతున్న నేరాల పై, శాంతిభద్రతల విషయంలో, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచి, సమాచారం సంబంధిత అధికారులకు అందించాలని ఆదేశించారు.సైబర్ నేరాల పైన ప్రత్యేక దృష్టి ఉండాలని ప్రజకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని,మీకు కేటాయించిన గ్రామాలలో శాంతిభద్రతలకు సంభందించిన విషయాలను ఎప్పటికప్పుడు సంభందిత అధికారులకు అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పాణ్యం యస్ ఐ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లో వృత్తి నైపుణ్యత, సాంకేతిక పరిజ్ఞానము ఉపయోగించి త్వరితగతిన విచారణ పూర్తి చేసి, నిర్దేశిత కాల వ్యవధిలో కోర్ట్ లో ఛార్జ్ షీట్ ఫైల్ చేసి, సమర్థవంతమైన ట్రయిల్ ద్వారా నిందితులకు కఠిన శిక్ష పడేలా చెయ్యాలని సూచించారు.
మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని,మహిళల రక్షణ కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన దిశ యాప్ పట్ల మహిళల్లో అవగాహన కల్పించి రిజిస్ట్రేషన్ చేయించాలని సూచించారు.
పి డి ఎస్, రైస్ ,గుట్కా వంటి జూదాలు, అసాంఘిక కార్యకలాపాలఫై ప్రత్యేక నిఘా ఉంచి పూర్తిగా అరికట్టాలని అధికారులను ఆదేశించారు.
మహిళలల అదృశ్యం మిస్సింగ్ కేసుల్లో సత్వరమే స్పందించాలని, సమగ్ర విచారణ జరిపి అదృశ్యమైన వారి ఆచూకీని వేగవంతం చేయాలని ఆదేశించారు.
నాటు సారాయి ,అక్రమ మద్యం మొదలగు వాటిపై ప్రత్యే నిఘా ఉంచి పూర్తిగా అరికట్టాలని ఆదేశిస్తూ సారా తయారీ,విక్రయాలను నిలిపివేయడం వలన జీవనోపాది కోల్పోతున్నవారికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని నాటు సారాయిని పూర్తిగా నిర్మూలించాలని ఆదేశించారు.
పోలీస్ స్టేషన్ లో వివిధ రకాల కేసులలో పట్టుబడిన వాహనాలను పరిశీలించి వాటిని త్వరగా సంబంధిత అధికారుల అనుమతి తీసుకుని డిస్పోజల్ చేయాలని ఆదేశించారు.
ప్రజలతో పోలీసులు మైత్రి భావం పెంపొందే విధంగా నడుచుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో శాంతిభద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేయాలని జిల్లా ఎస్పీ గారు ఆదేశించారు.
సైబర్ నేరాల పైన ప్రత్యేక దృష్టి ఉంచాలని ,సైబర్ నేరాలపై స్టేషన్ పరిధిలోని గ్రామాలలో మహిళా పోలీసులు జి యమ్ యస్ కె, డబ్ల్యు, యమ్ ఎస్ కె, వాలంటీర్స్ ద్వారా,పోలిసుల ద్వార అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని గడివేముల ఎస్ హెహ్,ఓ జిల్లా ఎస్పీ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీపి తో పాటు నంద్యాల డిఎస్పి డి.మహేశ్వర్ రెడ్డి పాణ్యం సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.వెంకటేశ్వర రావు ఎస్పీ సి సి ఫయాజ్ భాష పాల్గొన్నారు.

deva dattu

Devadattu Reporter Panyam
Back to top button