Yemmiganur

పశుసంవర్ధక పాలిటెక్నిక్ విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించిన.. ఆర్కే కంటి వైద్యశాల అధినేత డాక్టర్ హేమంత్ కుమార్.

పశుసంవర్ధక పాలిటెక్నిక్ విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించిన.. ఆర్కే కంటి వైద్యశాల అధినేత డాక్టర్ హేమంత్ కుమార్.

కర్నూలు జిల్లా,ఎమ్మిగనూరు మండల పరిధిలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థ బనవాసి పశుసంవర్ధక పాలిటెక్నిక్ విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.సతీష్ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు ఆర్కే కంటి వైద్యశాల అధినేత డాక్టర్ హేమంత్ కుమార్ నేతృత్వంలో కళాశాల విద్యార్థిని,విద్యార్థులకు శుక్రవారం రోజున ఉచిత కంటి వైద్య పరీక్షలు ,ఉచిత రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్కే కంటి వైద్యశాల అధినేత డాక్టర్ హేమంత్ కుమార్ మాట్లాడుతూ సర్వేంద్రీయణం నయనం ప్రధానం అనే నానుడిననుసరించి మనిషికి ఉన్న అన్ని అవయవాలులో కంటే కన్ను ఎంతో అమూల్యమైనదని , కాబట్టి అందరూ కంటి చూపు పట్ల, కళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సతీష్ మనిషి శరీరంలోని రక్తం ప్రాముఖ్య తను, అత్యవసర సమయంలో ఉపయోగపడే రక్తం యొక్క వర్గీకరణ చాలా ముఖ్యమని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గురువిష్ణు , డాక్టర్ ప్రవీణ, బోధనేతర సిబ్బంది పివి లక్ష్మణరావు, విధార్థినీ, విద్యార్థులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

K.Yallayya

K. Yallayya Reporter, Yemmiganuru,
Back to top button