
kosigi
పన్నగ స్వామి కి పరామర్శ
పన్నగ స్వామి కి పరామర్శ
మంత్రాలయం (పల్లెవెలుగు) 11 సెప్టెంబర్: టీడీపీ మండల అధ్యక్షుడు పన్నగ వెంకటేషప్ప స్వామి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వై. సీతారామిరెడ్డి మంత్రాలయం లోని స్వామి స్వగృహనికి చేరుకుని పరామర్శించారు. అనంతరం ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈయనతో పాటు వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ జి. భీమిరెడ్డి, సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, టీడీపీ నియోజకవర్గ నాయకులు వ్యాసరాజాస్వామి, గోపాలప్పస్వామి, అనంతసైనస్వామి, వ్యవసాయ సలహా మండలి సభ్యులు మల్లికార్జున నాయకులు జనార్దన్ రెడ్డి, వీకేసి రఘు, వెంకటరెడ్డి, సాంబ తెదేపా నాయకులు సుంకప్ప, నరసింహ, నరసింహ, యేబు తదితరులు ఉన్నారు.