
Dharmavaram
పదివేల రూపాయలు ఆర్థిక సహాయం
పదివేల రూపాయలు ఆర్థిక సహాయం
ధర్మవరం (పల్లె వెలుగు) 05 సెప్టెంబర్: పట్టణములోని 25 వ వార్డులో నివసిస్తున్న దంపెట్ల చిన్న కృష్ణారెడ్డి అనే వ్యక్తి బేల్దారి వృత్తిలో జీవితం కొనసాగిస్తూ ఉండేవాడు. ఆదివారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందడం జరిగింది. సమాచారం అందుకున్న వార్డు కౌన్సిలర్ మేడాపురం వెంకటేష్ , ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆదేశాల మేరకు తక్షణమే అక్కడకు చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వైయస్సార్ బీమా తరఫున వారి చేతుల మీదుగా పదివేల రూపాయలను అందజేయడం జరిగింది. మున్ముందు కుటుంబానికి అండగా ఉంటామని వారు తెలిపారు.