
పట్టభద్రులు తమ ఓటు హక్కును నవంబర్ 7 లోపు నమోదు చేసుకోవాలి
- పట్టభద్రులు తమ ఓటు హక్కును నవంబర్ 7 లోపు నమోదు చేసుకోవాలి
- వామపక్షాలు బలపరుస్తున్న పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయ కోసం దేవనకొండలో విస్తృత ప్రచారం..
- వామపక్షాలు బలపరుస్తున్న పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించి చట్టసభ లకు పంపుదాం..
దేవనకొండ (ఆంధ్ర ప్రతిభ) 02 నవంబర్: పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఎన్నికలను శాసించే ఓటు హక్కును నవంబర్ 7వ తేదీ లోపు నమోదు చేసుకోవాలని వామపక్షాలు బలపరుస్తున్న పిడిఎఫ్ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజును, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డిని తమ మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని కోరుతూ సిపిఐ, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన దేవనకొండ నందు విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా బుధవారం ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి జి. రంగన్న, సిపిఐ మండలం ప్రధాన కార్యదర్శి ఎం. నరసారావు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నందు నిరుద్యోగులను, ఉపాధ్యాయులను కలిసి మార్చిలో జరగబోయే ఎన్నికల నందు తమ అమూల్యమైన ఓటు వేసేందుకై ముందుగా ఓటు హక్కును నమోదు చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని గుర్తు చేశారు. 2023 మార్చిలో జరగనున్న పశ్చిమ, రాయలసీమ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నందున ఈ ఎన్నికలను ధనికులకు, సామాన్యులకు, సేవాపరులకు మరియు దోపిడీదారులకు, బూర్జువా పార్టీల పెత్తందారులకు మధ్య జరగనున్న ఎన్నికలన్నారు. గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన నాయకులు నిరుద్యోగులను మోసం చేసి వారి సమస్యలపై చట్టసభల్లో గల మెత్తకుండా వారి స్వలాభం కోసం పనిచేశారే తప్ప నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి కల్పించడంలో ఏమాత్రం ఉపయోగ పడలేదన్నారు.