
Dewanakonda
పట్టభద్రులారా మేల్కోండి
- పట్టభద్రులారా మేల్కోండి
- ఈనెల 7వ తేదీ లోపు తమ ఓటు హక్కును నమోదు చేసుకోండి
దేవనకొండ (ఆంధ్ర ప్రతిభ) 04 నవంబర్: పట్టభద్రుల ఓటు హక్కును నమోదు చేసుకోవడానికి నవంబర్ 9 లోపు నమోదు చేసుకుని, శాసన మండల లో నిరుద్యోగ సమస్యల పైన గర్జించే పోతుల నాగరాజును, ఉపాధ్యాయ సమస్యలపై పోరాడే కత్తి నర్సింహారెడ్డి ని ఓటు నమోదు చేసుకొని గెలిపించాలని శుక్రవారం దేవనకొండలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసి బస్టాండ్ ఏరియా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు పరిసరాల నందు వ్యవసాయ ఏ.ఈ కార్యాలయం మరియు ప్రభుత్వ కార్యాలయాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బి. వీరశేఖర్, ఏఐటీయుసీ జిల్లా నాయకులు ఎం. నరసరావు, ప్రజా సంఘాల నాయకులు సభ్యులు అశోక్, యూసుఫ్, పరమేశు, బజారి, కెపి. రాముడు తదితరులు పాల్గొన్నారు.