nandyala

నీరు పేదల కోసమే కాంగ్రెస్ పార్టీ విధానాలు

నీరు పేదల కోసమే కాంగ్రెస్ పార్టీ విధానాలు

 

కర్నూలు (పల్లెవేలుగు) 07 ఫెబ్రవరి: కుర్నూల్ జిల్లా మంత్రాలయం నియోజవర్గం కోసిగి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేయి చేయి కలుపుదాం రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపర్ధం అనే కార్యక్రమాన్ని మంత్రాలయం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బాబురావు అధ్యక్షన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ, ఎన్ఎస్యు ఐ రాష్ట్ర అధ్యక్షులు నాగ మధు యాదవ్ మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సుధాకర్ బాబు, చేయి చేయి కలుపుదాం రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుద్దాం అను ప్రోగ్రాం ఇన్చార్జిలు హరి, శ్రీరాములు మరియు ఐఎన్టిసి జిల్లా అధ్యక్షులు బతకన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో అరాచక ప్రభుత్వాలు వెళుతున్నందున పేదలకు ఎటువంటి మేలు చేయడం లేదని దేశ అభివృద్ధి కోసం నిరుపేదల బాబు కోసం ఒక్క కాంగ్రెస్ పార్టీ మెయిల్ చేస్తుందని అన్నారు, అయితే కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతూ ఓట్లు వేసుకోవడం దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు ఉదాహరణకు నేటి ప్రభుత్వా సంస్థలను దారా దత్తంగా ప్రైవేటీకరణ చేయడమే కాకుండా అదా నీ అంబానీయులకు అప్పగిస్తున్నారు జిఎస్టి అనేదాని అడ్డం పెట్టుకొని ప్రజలపై పెను భారము మోపుతూ నిత్యవసర వస్తువుల పైన పెట్రోల్ డీజిల్ పైన విపరీతమైన రేట్లు పెంచుతూ దేశ ప్రజలను సర్వనాశనం చేస్తున్నారు అందుకుగాను మన ప్రియతమైన రాహుల్ గాంధీ ప్రజల ఐక్యత కోసం దేశం యొక్క అభివృద్ధి కోసం గత సెప్టెంబర్ నుంచి జనవరి 30వ తేదీ దాకా దరిదాపు 3800 కిలోమీటర్లు భారత్ జోడోయాత్ర చేయడం జరిగినది అదేవిధంగా ప్రజలతో మమేకం అవ్వడానికి నిరుపేద లేక కష్టసుఖాలు తెలుసుకోవడం కోసం చేయి చేయి కలుపుదాం అను కార్యక్రమాన్ని చేపట్టాలని కాంగ్రెస్ నాయకులను ఆదేశించడం జరిగినది కావున నేటి నుంచి మార్చి 26 తారీకు వరకు ప్రతి గడప గడప తిరుగుతూ ప్రజలను చైతన్య పరచడ విధంగా కార్యక్రమాన్ని చేయాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలి గారు అన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి జిలాని, మంత్రాలయం మండల అధ్యక్షులు అబ్రహం, పెద్దకడబూరు మండల అధ్యక్షులు మల్లేష్ కౌతాళం మండల అధ్యక్షులు రవి, నియోజవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సోయిల్, మధువర ప్రసాద్, ఉప్పర నాగరాజు, ముక్కరన్న, లోకేష్ ,ఆరోను, యువ నాయకుడు కార్తీక్, రామాంజనేయులు, పెద్దజాన్, ఇక్బాలు, లతీఫ్ ,ఫరూక్ తదితర నాయకులు పాల్గొన్నారు

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button