
నియోజకవర్గ పరిధిలోని విద్యుత్ సమస్యలపై ప్రత్యేక దృష్టి
నియోజకవర్గ పరిధిలోని విద్యుత్ సమస్యలపై ప్రత్యేక దృష్టి
- మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ యస్ఈ ఉమాపతి ని కలిసిన కోసిగి మండల ఇంచార్జీ మురళీ మోహన్ రెడ్డి
కోసిగి (పల్లెవేలుగు) 14 ఫెబ్రవరి: వేసవికాలంను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ సమస్యలపై మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని కోసిగి మండల ఇంచార్జీ మురళీమోహన్ రెడ్డి పెర్కోన్నారు. సోమవారం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు కోసిగి మండల ఇంచార్జీ మురళీ మోహన్ రెడ్డి ఏపీయస్పీడిసియల్ కర్నూలు శాఖ యస్ఈ ఉమాపతి గారిని దోడ్డి బెళగల్ 33/11కెవి సబ్ స్టేషన్ నందు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వేసవి కాలంను దృష్టిలో ఉంచుకొని, వ్యవసాయం మరియు గృహఅవసరల నిమిత్తం విద్యుత్ కోతలు లేకుండా చూడాలని, 33/11కెవి విద్యుత్ సబ్ స్టేషన్లలో ఓవర్ లోడ్ ను తగ్గించేందుకు పెద్ద కడుబురు మరియు కౌతాళం మండలాలకు మధ్యన ఉన్న కోసిగికి నూతనంగా 132కెవి సబ్ స్టేషన్ ను మరియు కోసిగి మండలంకు అదనంగా జంపాపురంకు 33/11కెవి సబ్ స్టేషన్ ను మంజూరు చేయాలని ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి ఆదేశాల మేరకు మంత్రాలయం ఏడీ విశ్వశాంతి స్వరూప్ సమక్షంలో యస్ఈ ఉమాపతికి వినతి పత్రాన్ని మురళీమోహన్ రెడ్డి సమర్పించారు. ఈ విషయాలపై యస్ఈ ఉమాపతి సానుకూలంగా స్పందిస్తూ, వ్యవసాయంకు ఉదయం 9 గంటలు విద్యుత్ అందించేలా ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.