nandyala

నాయి బ్రాహ్మణ విద్యార్థి వసతి గృహమునకు మరియు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకారాన్ని అందించాలి

నాయి బ్రాహ్మణ విద్యార్థి వసతి గృహమునకు మరియు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకారాన్ని అందించాలి

నంద్యాల నవంబర్ 5 : ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలైన స్థానిక నంద్యాల పట్టణంలో

నాయి బ్రాహ్మణ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (నోపా) సేవా సంఘం ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణ హ్మణ విద్యార్థి (హాస్టల్) వసతి గృహము మరియు కమ్యూనిటీ హాల్ కర్నూలు పట్టణంలో నిర్మాణానికి సహకరించాలని,  నంద్యాల జిల్లా ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి , మరియు ఉమ్మడి జిల్లా కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ ను మర్యాదపూర్వకంగా పూలమాలలతో, పుష్పగుచ్చములు సమర్పించి కోరిన  కర్నూలు జిల్లా నాయి బ్రాహ్మణ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్  నారాయణ స్వామి ప్రకాష్ , కోరడం జరిగినది. ఈ సందర్భంగా ఉమ్మడి కర్నూలు మరియు నంద్యాల జిల్లాల నాయి బ్రాహ్మణ బిసి బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ మాట్లాడుతూ, పూర్వము నాయి బ్రాహ్మణులు అంటే సాక్షాత్ మహావిష్ణు స్వరూపమైన ధన్వంతరి స్వామి వంశస్థులుగా, వైద్యులుగా, మరియు త్యాగరాజు స్వామి నాద బ్రహ్మలు గా పిలువబడే వారు, కానీ కాలక్రమేణా, వారు శుభానికి, అసభానికి, వెళ్లి కర్మలు చేయడం వలన వారిని, చిన్నచూపు చూసి చులకన భావంతో మాట్లాడే వారిని, మంగళ కారులు, బదులుగా మంగళోడు, మంగళిది, బొచ్చు కొరిగేవాడు, అని నీచ భావనతో దుర్భాషలాడేవారు, ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన  జీవో నెంబర్ 50 అంటే ఎవరైనా సరే మంగళిది, మంగళోడు, బొచ్చు కరిగేవాడు అనే మాటలు నిషేధించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం వల్ల మాకు ఒక సముచిత స్థానం, ఏర్పడరమే కాకుండా, మళ్లీ పూర్వ వైభవం మాకు వచ్చిందని, అందుకు ఎంతో సంతోషంగా ఉందని మరొక్కసారి ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి కి ఎంతో రుణపడి ఉన్నామని, నాయి బ్రాహ్మణ సేవా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని, ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా , నాయి బ్రాహ్మణ సేవా సంఘానికి, తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ, చురుగ్గా అన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొని, ముందుండి నిరంతర సేవా తత్పరుడని, అందరి మన్ననలను పొందుతానని, తన వంతు ఆర్థిక సహాయ  కంకర ఇటుక ఇసుక తదితర సామాగ్రి మా వంతు ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలోకర్నూలు జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు జమ్ముల జనార్దన్, నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర కోశాధికారి  ధన విజయుడు, డాక్టర్ నవీన్ కుమార్ , రాష్ట్ర నాయి బ్రాహ్మణ మహిళా సంఘం రాష్ట్ర జనరల్ సెక్రెటరీ ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ గుంతనాల నాగమణి,  మరియు రిటైర్డ్ ఆర్.ఎస్.ఐ. పోలీస్ వెంకటస్వామి, మద్దిలేటి , తదితరులు పాల్గొన్నారు.

Back to top button