nandyala

నాయి బ్రాహ్మణులకు కులవృత్తి అయిన క్షౌర వృత్తిని దోచుకోవడం రిలయన్స్ అధినేత అంబానీకి ఎంతవరకు సమంజసం…? ఇది మీకు తగునా…?

  • నాయి బ్రాహ్మణులకు కులవృత్తి అయిన క్షౌర వృత్తిని దోచుకోవడం రిలయన్స్ అధినేత అంబానీకి ఎంతవరకు సమంజసం…? ఇది మీకు తగునా…?
  • మా  వృత్తికి ద్రోహం చేయాలని చూస్తే, ఐకమత్యంతో ఎంతటి వారినైనా ఎదిరించి, నిర్మించిన షాపులను ముట్టడిస్తాం..
  • మా కుల వృత్తిని మాకు దూరం చేస్తే పోరాడి ప్రాణ త్యాగాల కైనా సిద్ధమే
  • రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి ఊడుమల్పురం మల్లు గాళ్ళ సుబ్బరాయుడు

నంద్యాల నవంబర్ 08 (పల్లెవేలుగు) స్థానిక నంద్యాల పట్టణం కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా స్టేట్ బ్యాంక్ కాలనీలో వెలసిన శ్రీశ్రీ శ్రీ సీతారామ లక్ష్మణ హనుమాన్ సమేత త్యాగరాజు స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నాయి బ్రాహ్మణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు శ్రీ సీతారామ లక్షణ సమేత హనుమత్ శ్రీ త్యాగరాజ స్వామి దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్, రిటైర్డ్ డివిజన్ పంచాయతీ ఆఫీసర్ శ్రీ ఊడుమల్పూరం మల్లు గాళ్ళ సుబ్బరాయుడు మాట్లాడుతూ కార్తిక పౌర్ణమి పండుగ పురస్కరించుకొని  కార్తీక పౌర్ణమి విశిష్టతను తెలియజేస్తూ, నవంబర్ 15 మంగళవారం రోజున ఉదయం 6 గంటల నుండి పూజా కార్యక్రమాలు మరియు కార్తీక మాస వనభోజన మహోత్సవంలో భాగంగా ఉదయం 9 గంటల నుండి సంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా సంగీత కచేరీలు, శాస్త్రీయ నృత్యం అనంతరం వనభోజన కార్యక్రమం నంద్యాల పట్టణ మరియు పరిసర ప్రాంతాల నాయి బ్రాహ్మణ సోదరులు సోదరీ మణులు బంధుమిత్ర సపరివార సమేతంగా మా మన వనభోజన  కార్యక్రమం జయప్రదం చేయాలని తెలిపారు. అంతేకాకుండా నాయి బ్రాహ్మణ చరిత్ర పురాతన కాలం నుంచి కూడా మన యొక్క నాయిబ్రాహ్మణులు మొదట వైద్యులు తదుపరి క్షౌరాతి తదుపరి భగవంతుని సేవలో నిమగ్నమై భగవంతుని యొక్క ఉదయము మంగళ వాయిద్యాలతో నిద్రలేపి పడుకునేంతవరకు ఆ దేవుడు సేవలో నిమగ్నమై కార్యక్రమములు నిర్వర్తిస్తున్నారు. జనజీవన స్రవంతిలో మమైకమై వాళ్ళ యొక్క సేవ కార్యక్రమాలను చేస్తున్నారు. అలాంటి నాయి బ్రాహ్మణులు ప్రస్తుతము దీనవస్థలో ఉన్నారు నాయి బ్రాహ్మణులకు చాలా అన్యాయం జరుగుచున్నది. అలాంటి అన్యాయాన్ని ఎదురుకొనటానికి మన నాయి బ్రాహ్మణ సోదర సోదరీమణులు మన తెలుగు రాష్ట్రాల వాళ్లు ఇతర రాష్ట్రాల వాళ్ళు మన యొక్క రిలయన్స్ అధినేత అంబానీ గారు కౌరవృత్తి చేపట్టుటకు ముందుకు వస్తున్నారని తెలిసింది ఈ ఒక్క అన్యాయాన్ని అరికట్టుటకు అన్ని దేశాల ప్రజలు ముందుకు వచ్చి ధైర్యంగా ఎదుర్కొంటారని తెలియజేస్తున్నాను. దీనికి సంబంధించి మేము అన్ని రాష్ట్రాల ప్రజలు ఒకటిగా భారత్ బందుకు పిలుపునివ్వాలని కోరుచున్నాము కాబట్టి అంబానీ మా కులవృత్తి మాకు ఇవ్వవలసినదిగా మీరు జోక్యం చేసుకోకుండా మా వృత్తి మా వృత్తికి ఆటంకం కలగకుండగా మా కులవృత్తి మేము చేసుకునేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాము నాయి బ్రాహ్మణుల జీవన వృత్తికి ఉనికి కోల్పోకుండగా అందరము కాపాడుకోవాలని, పిలుపునిస్తున్నాము. అలా కాకుండా అంబానీ ముందుకు వచ్చినచో మేము నిరోధించుటకు నాయి బ్రాహ్మణ అంత ఐకమత్యముతో ఈ విపత్తును ఎదుర్కోవాలని పిలుపునిస్తున్నాము. మాకు అన్యాయం జరిగినచో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడిస్తామని, తదుపరి భారత్ బంద్ కూడా పిలుపునిస్తామని ఇందుమూలముగా తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా నాయి బ్రాహ్మణ సేవా సంఘం జనరల్ సెక్రెటరీ ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ గుంతనాల నాగమణి, నంద్యాల జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు దుర్వేసి వెంకటేశ్వర్లు, సెక్రెటరీ, కానాల శేఖర్, జిల్లెల్ల చిన్న రాంమ పుల్లయ్య జనరల్ సెక్రెటరీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం సహాయ కార్యదర్శి ఎం.భాస్కర్, ఎంసోమన్న ఇ.సీ. మెంబర్, శ్రియం జానకిరామ్ ఈ.సీ. మెంబర్, యం రామమద్దయ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్రెజరర్, సీఎం శ్రీనివాసులు ఆర్గనైజింగ్ సెక్రటరీ, నాయి బ్రాహ్మణ సేవా సంఘం నంద్యాల జిల్లా కన్వీనర్ పెద్ద రామ పుల్లయ్య సి మెంబర్, తుండుమల్ల వెంకటేశ్వర్లు గౌరవ సలహాదారులు, ఏలూరు సాయి కృష్ణ ప్రచార కార్యదర్శి, ఏపీ నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు ఎం నాగరాజు, నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు దుర్వేసి వెంకటేశ్వర్లు, నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Back to top button