kosigi

నాయకులు కార్యకర్తలు ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్ధంగా ఉండాలి

  • నాయకులు కార్యకర్తలు ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్ధంగా ఉండాలి
  • రేపట్నుంచి జరిగే ఇదేంకర్మ ప్రోగ్రామ్ వియవంతం చేయాలి
  • ప్రతి ఇంటిలో వైయస్సార్ పార్టీ వైఫల్యాలు తెలియజేయాలి
  • తెదేపా ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి

మంత్రాలయం (పల్లెవేలుగు) 01 డిసెంబర్: నియోజకవర్గంలో  ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్ధంగా ఉండాలని మంత్రాలయం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. కోసిగి మండలంలోని దుద్ది శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఆవరణంలో కోసిగి మండలం అన్ని గ్రామాలు నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ ఇన్ చార్జ్ లు, పోలింగ్ బూతు ఇన్ చార్జ్ లతో ఇదేంకర్మ ప్రోగ్రామ్ పై సమావేశం మండల కన్వీనర్ జ్ఞానేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పాలకుర్తి తిక్కారెడ్డి  మాట్లాడుతూ వైయస్సార్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, ఇపుడు చేస్తున్న ఆరాచక పాలన పై ప్రతి ఇంటికి తిరిగి వైయస్సార్ ప్రభుత్వం వైఫల్యాలు తెలియజేయాలని క్లస్టర్ ఇన్ చార్జ్ లు, పోలింగ్ బూతు ఇన్ చార్జ్ లు, నాయకులు కార్యకర్తలు కలిసి ఇదేంకర్మ ప్రోగ్రామ్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో అరాచక పాలన, మోసపూరితంగా చేసిన హామీలు పై ప్రభుత్వని నిలదీయాలని తెలియజేశారు ఈ వైయస్సార్ ప్రభుత్వం పెంచిన నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్, సాగునీరు, త్రాగునీరు, అభివృద్ధి పై ప్రజలు ద్వారా తెలుసుకోవాలని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు అధిక వర్షలు ద్వారా నకీలి విత్తనాలు ద్వారా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, మహిళలకు రక్షణ లేకుండా పోయింది ఈ రాష్ట్రంలో అని ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగు రైతు జిల్లా కార్యదర్శి నాడిగేని అయ్యన్న,  కోండగేని వీరారెడ్డి, సాతూనూరు కోసిగయ్య, పంపాపతి, నాడిగేని మహదేవ్, రాజు, మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి ఉమర్, వడ్డే రామయ్య,అన్ని గ్రామాలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Mohammad Yousuf

Mohammad Yousuf Reporter, Kosigi, Kurnool DIst
Back to top button