
నాడు నేడు కార్యక్రమం కళాశాలకు వర్తింపు చేయడం శుభపరిణామం… మండల ఇంచార్జీ మురళీమోహన్ రెడ్డి
నాడు నేడు కార్యక్రమం కళాశాలకు వర్తింపు చేయడం శుభపరిణామం… మండల ఇంచార్జీ మురళీమోహన్ రెడ్డి
కోసిగి (పల్లెవెలుగు) 21 సెప్టెంబర్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నాడు నేడు కార్యక్రమం పాఠశాలలతో పాటు పస్ల్ 2 కళాశాలకు వర్తింపు చేయడం శుభపరిణామమని మండల ఇంచార్జీ మురళీమోహన్ రెడ్డి అన్నారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు మండల ఇంచార్జీ మురళీమోహన్ రెడ్డి బుధవారం మండల కేంద్రము కోసిగిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు దాదాపు 74లక్షలతో ప్రహరీ గోడ మరియు మౌలిక సదుపాయాలకు మరియు కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయ నందు 22లక్షలతో రెండు అదనపు గదులకు భూమి పూజ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా మండల ఇంచార్జీ మురళీమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పాఠశాలలతో పాటు కళాశాలలో నూతన విద్యా బోధన జరుగుటకు పస్ల్ 2 కళాశాలలను కూడా ఎంపిక చేయడం జరిగిందని, అందులో భాగంగా ఈ రోజు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని, ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి, యువనేత ధరణీ రెడ్డి సహాయ సహకారాలతో మండల అభివృద్ధికి మరిన్ని నిధులు తెస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాడిగేని నరసింహులు, యంపీపీ ఈరన్న, మహాంతేష్ స్వామి, మంగమ్మ, నాడిగేని నాగరాజు, మాణిక్య రాజు, షౌఖత్, యన్ రాముడు, సోఫీ, యన్ వీరేష్, కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయ ప్రత్యేక అరికారిణీ పుష్పలత, కాంట్రాక్ట్ నాగరాజు, బుళ్ళి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.