Dewanakonda

నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ లో ఇవ్వాలి

  • నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ లో ఇవ్వాలి
  • తాసిల్దార్ కు వినతిపత్రం ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు జగదీష్

దేవనకొండ (ఆంధ్ర ప్రతిభ) 18 అక్టోబర్:  నష్టపోయిన రైతులను ఆదుకోవాలి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి ఎకరానికి 30 వేల నష్టపరిహారం ఇవ్వాలి అని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా తక్షణ సహాయక చర్యలు చేపట్టాలి అని ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి డిమాండ్ అతివృష్టి అనావృష్టి వల్ల నష్టపోయిన పత్తి ఉల్లి మిరప టమోటా వేరుశనగ రైతులను ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం డిమాండ్ చేసింది ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక దేవనకొండ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం మండల సహాయ కార్యదర్శి రాజు అధ్యక్షతన చేపట్టడం జరిగింది వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో సరైన వర్షాలు కురవక పంటలు సరిగ్గా పెరగలేదని అరకొర కాయలు కూడా కురిసిన అధిక వర్షాల వల్ల కూలిపోయాయి అని పత్తి వేరుశనగ పంటలు నీట మునిగి కుళ్లి పోయాయని గిట్టుబాటు ధర లేక ఒకపక్క అధిక వర్షాలతో మరోపక్క రైతు నష్టపోయారన్నారు వరుస కరువుతో అల్లాడుతున్న రైతు నాలుగు సంవత్సరాల నుండి కరువు వరదలతో సరైన వర్షాలు కురవక పంట సరిగ్గా చేతికి రాక నకిలీ విత్తనాలు మందులు తో మార్కెట్ నందు దళారుల దోపిడీ తో వడ్డీలు కట్టే పరిస్థితి లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కార్పోరేట్ వ్యాపారులకు వేల కోట్ల రుణమాఫీ ఆరు కాలం శ్రమ పడే రైతుకు అప్పుల బాధలు అధికారుల వేధింపులు తప్పడం లేదన్నారు రైతుల కష్టాల నుండి బయటపడేందుకు స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని కోరారు నష్టపోయిన పంటలను అంచనావేసి రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ తో పాటుగా ఇన్పుట్ సబ్సిడీని కూడా ఇవ్వాలని ఎకరానికి 30 వేల నష్టపరిహారం కు తగ్గకుండా ఇచ్చి ఆదుకోవాలని కోరారు అనంతరం మండల రెవెన్యూ అధికారి కి వినతి పత్రం అందించారు.

Back to top button