kosigi

నష్టపోయిన ఉల్లి రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలి

నష్టపోయిన ఉల్లి రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలి

కోసిగి (ఆంధ్రప్రతిభ) 22 సెప్టెంబర్: ఉల్లి పంటను ప్రభుత్వమే మార్క్ఫెడ్ ద్వారాక్వింటాలు 2000 రూపాయల ప్రకారంకొనుగోలు చేయాలని అదేవిధంగా నష్టపోయిన ఉల్లి రైతులకు ఎకరాక 50 వేల రూపాయలు ప్రకారం నష్టపరిహారం అందించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోసిగి మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం కోసిగి వ్యవసాయ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోసిగి మండల అధ్యక్షులు వీరేష్ మాట్లాడుతూ కోసిగి మండలంలో ఉల్లి సాగు చేస్తున్న రైతులు సరైన ధర లేకపోవడంతో రైతులు దివాలా తీస్తున్నారని పంట కోసం పెట్టిన పెట్టుబడి సైతం రైతులకు రావడంలేదని ఉల్లి పంటకు ఒక్కొక్క రైతు ఎకరాకు 50,000 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టడం జరిగిందని మార్కెట్లో ధర పడిపోవడంతో రైతులకు పెట్టుబడి కూడా రాక దీంతో అప్పులు తీర్చే మార్గం కానరాక దిక్కుతోచని పరిస్థితి రైతుల్లో నెలకొని ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వము మేల్కొని నష్టపోయిన ఉల్లి రైతులకు ఎకరాకు 50 వేల రూపాయలు ప్రకారం నష్టపరిహారం అందించాలని అదేవిధంగా ప్రస్తుతం ఉల్లి పంటను ప్రభుత్వమే మార్క్ ఫ్రైడ్ ద్వారా క్వింటాలు 2000 రూపాయల ప్రకారం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని వ్యవసాయ అధికారి రాజు కి అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి రాముడు వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి నాగేంద్ర రైతులు రామిరెడ్డి బాల హనుమంతు గడ్డం హనుమంతు తిక్కయ్య చింతకుంట ఈరన్న తాయన్న ఆ దెబ్బ రాము ఐరన్ ఈరన్న వెంకటేష్ ముక్రాయ కాంత నారాయణ వీరారెడ్డి నరసింహులు మల్లికార్జున శ్రీనివాసులు తదితరులు పాల్గొనడం జరిగింది

Mohammad Yousuf

Mohammad Yousuf Reporter, Kosigi, Kurnool DIst
Back to top button