nandyala

నంద్యాల హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ అధ్యర్వంలో విజయవంతమైన రక్తదాన శిబిరం

నంద్యాల హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ అధ్యర్వంలో విజయవంతమైన రక్తదాన శిబిరం

భారతదేశ వ్యాప్తంగా హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ ఆధ్వర్యంలో “పరివర్తన్” వారోత్సవాల్లో భాగంగా గత 13 సంవత్సరాల నుండి ప్రజలకు రక్తదానాలపట్ల అవగాహన కల్పించి రక్తకోరత లేని సమాజం నిర్మించాలనే సంకల్పంలో భాగంగా నేడు స్థానిక హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ నందు విజయ బ్లడ్ సెంటర్ నిర్వహణలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా ఎస్.పి రఘువీర్ రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ సిబ్బంది, బ్యాంక్ ఖాతాదారులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్బంగా ఎస్.పి రఘువీర్ రెడ్డి రక్తదానం చేసిన ప్రతిఒక్కరికి అభినందించారు. ఈ కార్యక్రమంలో హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ మేనేజర్స్ రామకృష్ణ, రామచంద్రా రెడ్డి, ఆపరేషన్స్ మేనేజర్ రామకృష్ణ రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ హుస్సేన్, బ్యాంక్ సిబ్బంది, విజయ బ్లడ్ సెంటర్ ప్రతినిధి షేక్ బాబా ఫక్రుద్దీన్ మరియు బ్లడ్ సెంటర్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button