
nandyala
నంద్యాల లో ఇందిరాగాంధీ 38వ వర్ధంతి
నంద్యాల లో ఇందిరాగాంధీ 38వ వర్ధంతి
నంద్యాలలోని స్థానిక నూనెపల్లి లో ఉన్న రాజీవ్ గాంధీ భవన్ లో నంద్యాల టౌన్ అధ్యక్షులు దాసరి చింతలయ్య ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ 38వ వర్ధంతి సందర్భంగా ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఇందిరా గాంధీ చేపట్టిన అనేక కార్యక్రమాలు 19 బ్యాంకులను జాతీయ చేసిన ఘనత ఇందిరా గాంధీ దేనని తెలిపారు. 20 సూత్రాల పథకం ప్రారంభించి నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించింది ఇందిరాగాంధీ మాత్రమేనని ఇవే కాకుండా ఆవిడ చేపట్టిన సంస్కరణలు గురించి నంద్యాల టౌన్ అధ్యక్షులు దాసరి చింతలయ్య, వుకొట్టు వాసు, మాట్లాడడం జరిగినది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వుకొట్టు వాసు, హామద్, అబ్దుల్లా, రవి, ప్రసాద్, ఆనంద్, రఫీ, మబు, రియాజ్ పాల్గొన్నారు.