
నంద్యాల పట్టణ ప్రజల నీటి కష్టాలు తీర్చండి – SDPI
నంద్యాల పట్టణ ప్రజల నీటి కష్టాలు తీర్చండి – SDPI
నంద్యాల (పల్లెవేలుగు) 10 ఫెబ్రవరి: పట్టణంలో గత కొన్ని రోజులుగా నడిగడ్డ , మాల్ దార్ పేట, గుడిపాడిగడ్డ, చాంద్ బడా, వెంకటాచలం కాలనీ, దేవనగర్, శ్రమదానం బ్రిడ్జి మరియు అనేక ప్రాంతాలలో ప్రజలు మంచి నీరు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ మంచినీటి సమస్యపై పరిష్కరించాలని SDPI ( సోషియల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో నంద్యాల ప్రజలకు నీటి కష్టాలు తీర్చండి అనే నినాదంతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. తదుపరి నంద్యాల మునిసిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకట దాసు మరియు మునిసిపల్ చైర్ పర్సన్ మాబున్ని సా లకు మెమోరండం ఇవ్వడం జరిగిందన్నారు. SDPI రాష్ట్ర అధ్యక్షులు హఫీజ్ అతావుల్లా ఖాన్ మాట్లాడుతూ ఇంకా ఎండాకాలం కూడా మొదలు కాలేదు అంతలోనే నంద్యాల పట్టణ ప్రజలకు నీటి కష్టాలు మొదలయ్యాయి గత కొన్ని నెలలుగా మంచినీటి కష్టాలు ఉన్నా కూడా నంద్యాల మునిసిపల్ అధికారులు అధికార పార్టీ కౌన్సిలర్లు, ఎమ్మెల్యే, ఎంపీ, పట్టించుకోకపోవడం చాలా దారుణమని ధ్వజమెత్తారు SDPI పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఫాజిల్ దేశాయ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు తీర్చవలసిన అధికార పార్టీ నాయకులు అవి గాలికి వదిలేసి సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకోవడంలో అక్రమ ఆస్తులపై , అక్రమ సంపాదనాలపై వారించుకోవడం చాలా సిగ్గుచేటని ప్రజలకు అవసరమైన ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టకుండా జగనన్న నవరత్నాలను అభివృద్ధిగా భావించి ప్రతి గడపగడపకు తెలియజేయడం నంద్యాల ఎమ్మెల్యే చేయవలసిన కార్యక్రమమా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో SDPI పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి కరీముల్లా, జిల్లా కార్యవర్గ సభ్యులు ముల్లా ఇస్మాయిల్, నంద్యాల అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ హసీనా భాను, ప్రధాన కార్యదర్శి కరీముల్లా, కార్యవర్గ సభ్యులు మాజీద్ ఖాన్, అబ్దుల్ రజాక్, సనావుల్లా మరియు పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు