
నంద్యాలలో స్నాక్ సిటీని ప్రారంభించిన బిజెపి జాతీయ మైనార్టీ కార్యదర్శి మోమిన్ షబానా
నంద్యాలలో స్నాక్ సిటీని ప్రారంభించిన బిజెపి జాతీయ మైనార్టీ కార్యదర్శి మోమిన్ షబానా
నంద్యాల (పల్లెవేలుగు) 03 అక్టోబర్: పట్టణంలోని పద్మావతి నగర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన స్నాక్ సిటీని సోమవారం బిజెపి జాతీయ మైనారిటీ కార్యదర్శి మోమిన్ షబానా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్నాక్ సిటీ యజమానులు దాదా, బ్లడ్ సద్దాం, నజీర్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ షోయబ్, విజయ బ్లడ్ బ్యాంక్ ఎండి రహమతుల్లా తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మోమిన్ షబానా మాట్లాడుతూ సిటీలలో లభించే నాన్ వెజ్ ఐటమ్స్ నంద్యాల లాంటి జిల్లా కేంద్రంలో కూడా లభించడం శుభ పరిణామమని, పట్టణ ప్రజలు ఈ స్నాక్ సిటీని సందర్శించి ఆదరించాలని ఆమె కోరారు. దాదాభాయ్ మాట్లాడుతూ నంద్యాల జిల్లా కేంద్రంలో అన్ని రకాల ప్రజలకు అందుబాటులో స్నాక్ సీటి ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో పలు రకాల చికెన్ ఐటమ్స్ ఉన్నట్లు ఆయన తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు మా స్నాక్స్ సిటీని సందర్శించి ఆదరించాలని కోరారు