nandyala

నంద్యాలలో ప్రారంభమైన అంత రాష్ట్ర  ఈ ఎన్ టి సదస్సు

నంద్యాలలో ప్రారంభమైన అంత రాష్ట్ర  ఈ ఎన్ టి సదస్సు

 

నంద్యాల (పల్లెవెలుగు) 30 జూలై: ఆంధ్రప్రదేశ్ ఈ ఎన్ టి వైద్యుల సంఘం ఆధ్వర్యంలో, మధుమణి చారిటబుల్ సొసైటీ సహకారంతో,మధుమణి నర్సింగ్ హోమ్ నిర్వహణలో, స్థానిక మధు మణి సమావేశ భవనంలో శని వారం నంద్యాలలో అంతర్ రాష్ట్ర చెవి ముక్కు గొంతు శస్త్ర చికిత్సల వైద్య వైజ్ఞానిక సదస్సు,శస్త్ర చికిత్సల శిక్షణా కార్య శాల ( వర్క్ షాప్) ప్రారంభమైంది. మధుమణి నర్సింగ్ హోమ్ నిర్వాహకులు డాక్టర్ మధుసూదనరావు డాక్టర్ నాగమణి, డాక్టర్ మణిదీప్ నిర్వహణలోఎర్పాటు చేసిన  ఈ రెండు రోజుల సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమం ఐఎంఏ రాష్ట్ర ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ రవి కృష్ణ అధ్యక్షతన జరగగా, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్, మాజీ వైస్ ఛాన్స్ లర్ వేణుగోపాల్ రెడ్డి,రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, శ్రీ గురు రాఘవేంద్ర విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ దస్తగిరి రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ మధుసూదనరావు మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా ఈ శస్త్ర చికిత్సల కార్యశాల మరియు సదస్సు నిర్వహిస్తున్నామని ఇది 13వ సదస్సు అన్నారు.   నిర్వాహక కార్యదర్శి డాక్టర్ మణిదీప్ మాట్లాడుతూ ఈ రెండు రోజుల సదస్సులో ఆరు రాష్ట్రాల నుండి 200 మంది చెవి ముక్కు గొంతు వైద్యులు ప్రతినిధులుగా పాల్గొంటున్నారని తెలిపారు. ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇటువంటి వైజ్ఞానిక సదస్సులు యువ వైద్యులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని  వారు భవిష్యత్తులో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి దోహదపడుతుందని అన్నారు. డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పలు రాష్ట్రాల నుండి చెవి ముక్కు గొంతు వైద్యులు నంద్యాలకు ఆధునిక శస్త్ర చికిత్సల శిక్షణ కోసం రావడం నంద్యాలకు గర్వకారణం అన్నారు. డాక్టర్ దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ ఈ పోటీ ప్రపంచంలో విజయం సాధించాలంటే యువ వైద్యులు నిరంతరం ఆధునిక విధానాలను నేర్చుకుని నైపుణ్యాలను పెంచుకొన వలసిన అవసరం చాలా ఉందన్నారు. డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ మహానగరాలలో నిర్వహించే స్థాయిలో నంద్యాలలో ఇటువంటి వైజ్ఞానిక సదస్సు మధుమణి  ఆస్పత్రి వైద్యులు డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ నాగమణి, డాక్టర్.చిత్తలూరు మణిదీప్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. జాతీయస్థాయి ప్రముఖ చెవి ముక్కు గొంతు నిపుణులు కలకత్తా కు చెందిన అపోలో ఆసుపత్రి డాక్టర్ కాంతిలాల్ ఘోష్,తమిళనాడుకు చెందిన డాక్టర్ జానకిరామ్ మాట్లాడుతూ తమతో పాటు డాక్టర్ మధుసూదన్ రావు కలసి రెండు రోజులలో 20 శస్త్ర చికిత్సలు చేస్తూ  మెలకువలు వివరిస్తామని, సదస్సులో  పాల్గొంటున్న చెవి ముక్కు గొంతు వైద్యులు సమావేశ భవనంలో ఎల్ఇడి తెరమీద ఆపరేషన్ థియేటర్లో జరుగుతున్న శస్త్ర చికిత్సలను తిలకిస్తూ వారి సందేహాలను అప్పటికప్పుడే నివృత్తి చేసుకోవడం జరుగుతుందన్నారు. డాక్టర్ జానకిరామ్, డాక్టర్ తుషార్ కాంతి ఘోష్ ఇరువురిని డాక్టర్ మధుసూదన్ రావు   కుటుంబ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ నాగమణి, డాక్టర్ మణిదీప్ డాక్టర్ మధుప్రీతి, ప్రణీత్, సింధు,రాష్ట్ర చెవి ముక్కు గొంతు వైద్యుల సంఘం అధ్యక్షులు డాక్టర్ శ్రీనాథ్, ఐఎంఏ నంద్యాల అధ్యక్షులు డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ సహదేవుడు, రాష్ట్రంలో ప్రముఖ ఈఎన్టీ వైద్యులు డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ సింగరి ప్రభాకర్ ,డాక్టర్ సుబ్బరాయుడు వివిధ రాష్ట్రాల నుండి  విశేష సంఖ్యలో వచ్చిన చెవి ముక్కు గొంతు వైద్యులు పాల్గొన్నారు.

Back to top button