nandikotkur

నందికొట్కూరు లో రోడ్డు సేఫ్టీ కార్యక్రమం

నందికొట్కూరు లో రోడ్డు సేఫ్టీ కార్యక్రమం

నంద్యాల జిల్లా నందికొట్కూరు డ్రైవర్ అసోసియేషన్ నందు 20 తేదీన రోడ్డు సేఫ్టీ కార్యక్రమం సనా ఎడ్యుకేషన్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిధులుగా ఏఎస్ఐ బాలచంద్రారెడ్డి లారీ ఓనర్ల అసోసియేషన్ మహమ్మద్ షబ్బీర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు సన ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు అప్సర్ ఉసేన్ మరియు రిసోర్స్ పర్సన్ కొమ్ము పాలెం శ్రీనివాస్ తెలిపారు. లారీ ఓనర్లను డ్రైవర్లను ఉద్దేశిస్తూ మోటార్ యాక్ట్ చట్టాన్ని 2019 గురించి వివరించారు. చట్టం తెలియజేసినటువంటి 181 సెక్షన్ నుండి 196 సెక్షన్ల వరకు మొత్తం ఫైన్ ఏ విధంగా ఉంది ఎలాంటి తప్పులు చేస్తే ఫైన్ ఎంత పడుతుంది తాగి డ్రైవ్ చేయడం వల్ల జరిగే నష్టాల గురించి వివరించి చెప్పారు.  జాతీయ రహదారుల మంత్రి శాఖ సహకారంతో రహదారుల భద్రత అవగాహన కార్యక్రమం నంద్యాల జిల్లాలో విద్యార్థులకు లారీ డ్రైవర్లకు అసోసియేషన్ ఓనర్లకు వీటికి సంబంధించిన మెటీరియల్ను పంచుతూ అవగాహన కల్పించడం జరిగింది. దక్షిణ భారతదేశాన్ని కలిపి జాతీయ రహదారి మార్గాల ద్వారా ప్రయాణించే వారి వాహనాలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డ్రైవర్ల అతివేగం వలన ప్రయాణించడం ద్వారా ఎన్నో సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోతున్నారని వారు తెలియజేశారు. రహదారి భద్రత సూత్రాలను పాటించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఓవర్ స్పీడ్ ఓవర్ లోడ్ వాటి అంశాల్లో ఎంతెంత పైను చట్టం చెబుతుందో అంశాలన్నిటినీ కూడా ఈ సదస్సులో స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కుమ్మరి భాష మరియు ఉబేద్ పాల్గొన్నారు

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button