
ధర్మవరం ఎఫ్ఎసి తహసీల్దారినీ గా యుగేశ్వరి దేవి బాధ్యతలు స్వీకరణ.
ధర్మవరం ఎఫ్ఎసి తహసీల్దారినీ గా యుగేశ్వరి దేవి బాధ్యతలు స్వీకరణ.
ధర్మవరం (పల్లె వెలుగు) అక్టోబర్ 10: ధర్మవరం ఫుల్ అడిషనల్ చార్జ్ (ఎఫ్ఏసీ) తహసీల్దారినీ గా యుగేశ్వరి దేవి పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం యుగేశ్వరి దేవి మాట్లాడుతూ అన్నివేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. తదుపరి కార్యాలయంలోని అధికారులు, సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సోమవారము జరిగే స్పందన కార్యక్రమములో వచ్చే ఫిర్యాదులను, సాధ్యమైనంత త్వరగా, ఇచ్చిన గడువు తేదీలోగా పరిష్కరించే బాధ్యత అధికారులదేనని వారు గుర్తు చేశారు. ఓటర్ కార్డ్ ఆధార్ లింక్ ప్రక్రియను అనుకున్న గడువులోగా పూర్తి చేయాలని, 18 సంవత్సరాలు వయసు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు గుర్తింపు కార్డును పొందినప్పుడు ఓటు హక్కును ఎన్నికల్లో వేసే అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా మండల పరిధిలో రీ సర్వే కార్యక్రమాన్ని రైతుల యొక్క సహాయ సహకారాలతో సిబ్బందితో వెను వెంటనే పూర్తిచేసేలా బాధ్యతతో, మెలగాలని తెలిపారు. విధుల యందు నిర్లక్ష్యం వహిస్తే, కఠిన చర్యలు తప్పవని సూచించారు. తాసిల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రతి వ్యక్తితో సమన్వయంతో, గౌరవంగా పలకరించినప్పుడే, మంచి గుర్తింపు వస్తుందని తెలిపారు. తప్పనిసరిగా సమయపాలన పాటిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందేలా కృషి చేయాల్సిన బాధ్యత, అధికారుల ది ,సిబ్బంది దేనని అందరూ గుర్తు ఎరగాలని వారు తెలిపారు.