
Allagadda
ద్విచక్ర వాహనాల తనిఖీ నిర్వహించిన రూరల్ సీఐ
ద్విచక్ర వాహనాల తనిఖీ నిర్వహించిన రూరల్ సీఐ
ఆళ్లగడ్డ మండల పరిధిలో గల చిన్న కందుకూరు మెట్ట వద్ద రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి సిబ్బందితో కలసి చిన్న కందుకూరు మెట్ట వద్ద ద్వి చక్ర వాహనాలను తనిఖీ చేశారు. అదేవిధంగా మోటారు సైకిళ్లపై పోయే ప్రజలకు హెల్మెట్ గురించి అవగాహన కల్పిస్తూ హెల్మెట్ ధరిస్తే కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని ద్విచక్ర వాహనదారులకు సూచించారు. అతివేగం ప్రాణాంతకమని వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతారని కాబట్టి నిర్దేశించిన వేగంతోనే వాహనాలను నడపాలని వారికి అవగాహన కలిగించారు.