
దోమల బెడద నిర్మూలనకు ఫాగింగ్
దోమల బెడద నిర్మూలనకు ఫాగింగ్
కోసిగి (ఆంధ్రప్రతిభ) 22 సెప్టెంబర్: మేజర్ పంచాయతీ కోసిగిలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండాముందస్తు భాగంగా గ్రామంలో స్ప్రే ఫాగింగ్ గ్రామ సర్పంచ్ కుమారి అయ్యమ్మ, పంచాయతీ సెక్రెటరీ సత్తెన్న, వైసీపీ మండల సీనియర్ నాయకులు మాణిక్య రాజు ఆధ్వర్యంలో గురువారం చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోసి గ్రామంలో 1,7,9 వార్డులలో ఉన్న డ్రైనేజీ లో స్ప్రే చేయడం జరిగింది , అలాగే 3 ,4 ,5 వార్డులలో ఫాగింగ్ చేయడం జరిగిందని వారు తెలిపారు.అలాగే గ్రామంలో ఉన్న అన్ని వార్డులలో స్ప్రే ఫాగింగ్ చేయడం జరుగుతుందని వారు స్పష్టంచేశారు.అలాగే ప్రతి ఒక్కరూ దోమల బెడద గురికాకుండా ఉండేందుకు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ,తాగునీటిని కాచి చల్లార్చి వడబోసి తాగాలని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు రాజేష్ రాముడు పంచాయతీ సిబ్బంది మధు రాఘవేంద్ర తాయన్న తదితరులు పాల్గొన్నారు