kosigi

దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు

  • దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు
  • ఇద్దరు ముద్దాయిల అరెస్ట్
  • బంగారం,వెండి,డబ్బులు రికవరి.

కోసిగి (పల్లెవేలుగు) 03 నవంబర్: ఎస్పీ ఆదేశాల మేరకు ఆదోని  డీఎస్పీ ఆధ్వర్యంలో  కోసిగి సీఐ ఎరిసావలి  ఎస్సై రాజారెడ్డి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి రాబడిన సమాచారం మేరకు ముద్దాయిలను అరెస్టు చేయడం జరిగింది. కోసిగి లో నివసిస్తున్న సిరివరం విజయ్ కుమార్  తండ్రి పేరు ఎస్ అయ్యప్ప  రాయచూర్ లోని బట్టల షాపులో గుమస్తాగా పని చేసేవాడు. ఈ క్రమంలో రాయచూర్ లోని  గురు రాజ్ తో పరిచయం ఏర్పడి  వారితో కలిసి మద్యం సేవిస్తూ, క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ జల్సాలు చేస్తుండేవారు. ఇద్దరు కలిసి రాయిచూర్ లో చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు. గతంలో బెట్టింగ్ ఆడడం ద్వారా ఉన్న అప్పులు ఎక్కువ అవడంతో  ఎలాగైనా  డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో, మూడు నెలల క్రితం కోసిగిలోని చాకలిగేరి వెంకటేశ్వర్లు ఇంటిలో ఏడు నెలల క్రిందట కోసిగొయ్య గుడి దగ్గర గల ఇంటిలో, ఐదు నెలల కిందట సాయిబాబా గుడి దగ్గర గల ఇంటిలో, ఇద్దరు కలిసి చేసిన దొంగతనాలను  తెలపడం జరిగింది. వీరి వద్ద నుంచి 44.5 గ్రాముల బంగారు, 230 గ్రాముల వెండి వస్తువులను 9500 నగదులను  సేకరించారు. మొత్తం విలువ 1,57, 500 అని తెలిపారు.  ఈ కేసును చేదించిన సిబ్బందికి ఆదోని డిఎస్పి ప్రత్యేకంగా అభినందించారు. కోసిగి పోలీస్ సిబ్బంది మరియు పెద్దకడబూరు ఎస్సై కే శ్రీనివాసులు పాల్గొన్నారు.

Mohammad Yousuf

Mohammad Yousuf Reporter, Kosigi, Kurnool DIst
Back to top button