kosigi

దేశానికే ఆదర్శం నాడు నేడు కార్యక్రమం

  • దేశానికే ఆదర్శం నాడు నేడు కార్యక్రమం
  • మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు మురళీమోహన్ రెడ్డి

 

కోసిగి (పల్లెవెలుగు) 13 సెప్టెంబర్: ఉన్నత విద్య ప్రమాణాలతో కూడిన విద్యను సరికొత్త డిజిటల్ క్లాస్ ద్వారా బోధన్ అందివ్వడం కోసం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నాడు నేడు కార్యక్రమం  పియం శ్రీ ద్వారా దేశానికే ఆదర్శం నిలిచిందని మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు మురళీ మోహన్ రెడ్డి పేర్కోన్నారు‌. వైకాపా కర్నూలు జిల్లా అధ్యక్షులు మరియు మంత్రాలయం శాసనసభ్యులు వై.బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం కోసిగి మండలపరిధిలోని నాడు నేడు కార్యక్రమం క్రింద సాతనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో దాదాపు 1.11కోట్లతో 9అదనపు గదులకు మరియు ఆర్లబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాదాపు 1.06 కోట్లతో 9అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంకు ముఖ్య అతిథిగా మురళీ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఆయా పాఠశాలల విద్యార్థులచే పూలవర్షంతో ఆహ్వానిస్తూ స్వాగతం పలికారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,అతి త్వరలోనే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కల్గిన బైజుస్ యాప్ ద్వారా రంగు రంగులతో కూడిన గదుల్లో డిజిటల్ క్లాస్ బోధించడం జరుగుతుందని, అందుకు గాను ఈ విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు ప్రముఖ సంస్థ ద్వారా ట్యాబ్ అందివ్వడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాడు నేడు ఏఈ రంగరాజు, మండల కన్వీనర్ బెట్టనగౌడ్, ఏపీఓ జయరాం,కాంట్రాక్ట్ బసిరెడ్డి,సాతనూరు సర్పంచ్ మంగమ్మ, తుమ్మిగనూరు సర్పంచ్ ఈరన్న, యంపీటీసీలు సుజాత, తాయమ్మ,సాతనూరు గ్రామ నాయకులు చంద్ర, బసవన్న గౌడ్, విశ్వనాథ్ స్వామి, మాజీ ఎంపీటీసీ వడ్డే చంద్ర, కురువ రామన్న, కురువ అయ్యన్న, యఫ్ఏ విశ్వనాథ్, గురురాజ గౌడ్,జాన్,నజీర్, ఆర్లబండ నాయకులు పరుశురాం, గాదిరెడ్డి, హనుమప్ప, కాశీం, వెంకటేశులు, యంకన్న, యచ్.అంజినయ్య, ఇస్మాయిల్, పంచాయతీ కార్యదర్శి పరుశురాం, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు శేఖర్ బాబు, జాన్ బాబు, స్కూల్ కమిటీ చైర్మన్లు అయ్యమ్మ, సిద్దప్ప, ప్రాధానోపాద్యాయులు పురుషోత్తం రెడ్డి, రాము తదితరులు పాల్గొన్నారు.

Mohammad Yousuf

Mohammad Yousuf Reporter, Kosigi, Kurnool DIst
Back to top button