Dewanakonda

దేవనకొండ సీపీఐ కార్యాలయం ఎదుట సీపీఐ 98 వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలు

దేవనకొండ సీపీఐ కార్యాలయం ఎదుట సీపీఐ 98 వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలు పేద ప్రజల సమస్యల పరిష్కరమే సీపీఐ లక్ష్యం

ఆంధ్ర ప్రతిభ దేవనకొండ పేద ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సిపిఐ పార్టీ నిరంతర పోరాటాలు కొనసాగిస్తుందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే. మద్దిలేటి శెట్టి, మండల కార్యదర్శి నరసారావు లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం సిపిఐ 98వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు దేవనకొండ సిపిఐ కార్యాలయం నందు ఘనంగా జరుపుకోవడం జరిగింది.ఈ 98 వ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమానికి సీపీఐ దేవనకొండ పట్టణ కార్యదర్శి నెట్టేకల్ అధ్యక్షత వహించారు. సీపీఐ 98 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సీపీఐ సీనియర్ నాయకుడు పూజారి ప్రసాద్ సీపీఐ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా స్థానిక దేవనకొండ సీపీఐ కార్యాలయం ఎదుట జరిగిన సీపీఐ 98 వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలో సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు కె.మద్దిలేటిశెట్టి,సీపీఐ మండల ప్రధాన కార్యదర్శి ఎమ్.నరసరావు లు పాల్గొని మాట్లాడుతూ.. భారతదేశ స్వాతంత్రం రాకమునుపు 1925 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో డిసెంబర్ 26న ప్రారంభమైన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అనేక కుట్ర కేసులు ఎదుర్కొని, లక్షలాదిమంది ప్రాణ త్యాగాలతో,ఎన్నో వీరోచిత పోరాటాలు చేసి భారతదేశానికి స్వాతంత్రం సాధించిన ఘనత సిపిఐ దే నని, సీపీఐ 97 సంవత్సరాలు పూర్తి చేసుకుని 98వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా కూడు,గూడు లేనటువంటి నిరుపేద ప్రజలకు అండగా ఎర్రజెండా ముందు ఉంటుందని వారు అన్నారు.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4 వేల మంది ప్రాణాలు ఇచ్చి, లక్షలాది ఎకరాలను పేద ప్రజలకు భూమిని పంపిణీ చేసిన చరిత్ర సిపిఐ పార్టీకి తప్ప ఏ ఇతర పార్టీలకు లేదని వారు కొనియాడారు.

Back to top button