Dewanakonda

దేవనకొండ సి ఎల్ ఆర్ సి భవనంలో పత్తికొండ ఏ బి ఏ మరియు మండల వ్యవసాయ సిబ్బందితో సమీక్షా సమావేశం

దేవనకొండ సి ఎల్ ఆర్ సి భవనంలో పత్తికొండ ఏ బి ఏ మరియు మండల వ్యవసాయ సిబ్బందితో సమీక్షా సమావేశం

దేవనకొండ (ఆంధ్ర ప్రతిభ) 20 అక్టోబర్: పత్తికొండ ఏబిఏ మాట్లాడుతూ ఈ కేవైసీ మండలంలో 99% పూర్తి చేసినందుకు అందరికీ అభినందనలు తెలిపారు అలాగే వచ్చే రవి కాలంలో ప్రతి ఒక్కరూ పొలంబడి నిర్వహించాలని సూచించారు ప్రతి ఆర్ బికే సిబ్బంది రైతులతో మమేకమై వారికి సస్యరక్షణ గురించి సూచనలు చేయాలని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి సురేష్బాబు మాట్లాడుతూ ప్రతి ఆర్ బికే సిబ్బంది పొలంబడి నిర్వహించాలని అలాగే వేరుశనగ వేసే ప్రతి రైతు ట్రై కోడెర్మా తో విత్తన శుద్ధి చేసుకోవాలని తెలిపారు. ప్రతి డీలరు జి రిజిస్ట్రేషన్ మిషన్ శైలు సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి అని తెలిపారు ఎవరైనా చట్టవిరుద్ధమైన పనులు చేస్తే డీలర్స్ కు లైసెన్స్ క్యాన్సల్ చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వోలు యోగి రంగన్న మరియు మండల వ్యవసాయ సిబ్బంది పాల్గొనడం జరిగింది

Back to top button