
దుల్హన్ పథకం బిలాశరథ్ అమలు చేయాలి
దుల్హన్ పథకం బిలాశరథ్ అమలు చేయాలి
నంద్యాల (పల్లెవేలుగు) 08 అక్టోబర్: శనివారం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ iuml వైఎస్ ప్రెసిడెంట్ మౌలానా రఫీ ఉద్దీన్ మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైయస్సార్ దుల్హన్ పథకం అని పేరు పెడతాము లక్ష రూపాయలు ఇస్తాము అని చెప్పారు. కానీ ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి ఏ ఒక్క రూపాయి కూడా ముస్లిం మైనార్టీలకు ఇవ్వలేదు ఎలాంటి అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి గడవు తీరుతుంది కాబట్టి మళ్లీ అధికారంలో కి రావడానికి ఇప్పుడు దుల్హన్ పథకం జారీ చేస్తున్న అని చెబుతున్నారు. అంతేకానీ ఇచ్చే ఉద్దేశం లేదు ఎందుకంటే ఈ పథకానికి అర్హులకు షరతులు పెట్టారు ఆ షరతులకు ఏ ఒక్కరూ అర్హులు కారు అంటే ఇస్తామని చెప్పాము ఎవరు అర్హులు లేరు కాబట్టి ఇవ్వలేదు. ఒక సామేత ఉంది కట్టా విరగకూడదు పాము చావకూడదు ఇచ్చేవారే అయితే ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలి. ఈ షరతులు ఐదు సంవత్సరాల తర్వాత అమలు అవుతాయని పెట్టగలరు అని చెప్పారు. మరియు జిల్లా జనరల్ సెక్రెటరీ మౌలానా అబ్దుల్ సలాం మాట్లాడుతూ దుల్హన్ పథకం బిలాశరథ్ అమలు చేయాలి మీకు చేతకాకపోతే రాజీనామా చేయండి ఎందుకంటే మీ మేనిఫెస్టోలో ఇలాంటి షరతులు లేవు ఒకవేళ మీరు షరతులు పెట్టాలని అనుకుంటే మందు తాగినోని బిడ్డకు ఈ పథకానికి అనార్హత అని శరత్ పెట్టగలరు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఒప్పుకుంటుంది మీకు ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి ఇలాంటి షరతులు పెట్టారు దుల్హన్ పథకం బిలాశరథ్ వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ సెక్రెటరీ ఉమర్ మరియు బిర్యానీ హుస్సేన్ భాయ్, పెయింటర్ మాలి పాల్గొన్నారు