
Dharmavaram
తోలుబొమ్మల కళాకారుడికి అంతర్జాతీయ అవార్డు
తోలుబొమ్మల కళాకారుడికి అంతర్జాతీయ అవార్డు
ధర్మవరం:(పల్లె వెలుగు) శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం మండలంలోని నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలుబొమ్మల కళాకారుడు దలవాయి కుల్లాయప్పా ఈనెల 22వ తేదీన ఢిల్లీలో వర్డ్స్ క్రాప్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల ప్రధాన ఉత్సవములో కౌన్సిల్ డైరెక్టర్ నుంచి అవార్డు అందుకోవడం జరిగిందని కుల్లాయప్ప తెలిపారు. అంతేకాకుండా కులాయప్ప తోలుబొమ్మల తయారీలో ప్రతిభ కనపరచడంతో ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ 2021 అవార్డుకు కూడా ఎంపిక అయ్యారు. తదుపరి వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ బృందము, అధికారులు, కళాకారులు, నిమ్మలకుంట గ్రామస్తులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.