
Allagadda
తుఫాను రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి
తుఫాను రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మండుస్ తుఫాన్ తాకిడికి రోడ్ లపై ధాన్యం తడిసిపోయి, మరోవైపు వరి పొలాలు దెబ్బతిన్నాయని ఆళ్లగడ్డ బిజెపి ఇన్చార్జి భూమా కిషోర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని రైతులు అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారని, ఈ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, రైతులను అన్ని విధాల ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైసీపీ నాయకుల అవినీతి, అక్రమాలకు అంతులేకుండా పోతున్నదని భూమా కిషోర్ రెడ్డి విమర్శించారు. PDS రైస్ మొదలుకొని, అక్రమ మట్టి తవ్వకాలు , రోడ్లు డ్రైనేజీలు నిర్మాణ పనులు తదితర అన్ని రంగాలలో అవినీతి, అక్రమాలకు అంతులేకుండా పోయిందని ఆయన దుయ్య బ ట్టారు.