
Dharmavaram
తిప్పేపల్లి వద్ద చిత్రావతి నదిలో కొట్టుకుపోయిన ఇసుక ట్రాక్టర్
తిప్పేపల్లి వద్ద చిత్రావతి నదిలో కొట్టుకుపోయిన ఇసుక ట్రాక్టర్
ధర్మవరం (పల్లె వెలుగు) సెప్టెంబర్ 7 : సత్య సాయి జిల్లా ధర్మవరం మండలం తిప్పేపల్లి వద్ద శుక్రవారం సాయంత్రం ఇసుక ట్రాక్టర్ చిత్రావతి నదిలో కొట్టుకొని పోయింది. మరో ఇసుక ట్రాక్టర్ తృటిలో ప్రమాదం నుండి బయటపడింది. నల్లబోయనపల్లి వద్ద ఉన్న ఇసుక రిచ్ నుండి ధర్మవరం వెళుతున్న ఇసుక ట్రాక్టర్ మెయిన్ రోడ్డులో రవాణా శాఖ అధికారులు తనిఖీ చేస్తున్నారు అని తెలిసి అడ్డ వెళ్లే క్రమంలో ట్రాక్టర్ కొట్టుకొని పోయినట్లు తెలిసింది. ప్రమాదం నుండి డ్రైవర్ ను తిప్పేపల్లి గ్రామ ప్రజలు సురక్షితంగా రక్షించారు. కాగా ఇక్కడ గురువారం సాయంత్రం కూడా ఆటో కొట్టుకొని పోయింది.