kosigi

తరాలు మారినా కలగని సౌకర్యం

తరాలు మారినా కలగని సౌకర్యం

కోసిగి గ్రామనికి 7కిలోమీటరు దూరంలో ఉన్న
పికల బెట్ట గ్రామం మీదుగా చెన్నై టూ ముంబై రైల్వే ట్రాక్ ఏర్పడి సుమారు 120 సంవత్సారాలు అయింది.అప్పటిను0చి ఇప్పటి వరకు అ గ్రామనికి వెళ్ళాలి అంటే బస్టాండ్ ను0చి రైల్వే ట్రాక్ దాటుతూ 2 కిలోమీటర్లు నడవాలి అయితే సోమవారం రైల్వే అధికారులు ట్రాక్ దాటడానికి లేకుండా పూర్తిగా మూసివేశారు.అలాగే ట్రాక్ పక్కన ఉన్న ఆటో మార్గం కూడా మూసివేసే క్రమంలో గ్రామస్తులు అంత వచ్చి అధికారులను అడగ్గా పై అధికారుల ఆదేశాలమేరకు ముసివేశం అన్నారు.అను నిత్యం విద్యర్తులు,రైతులు,
వైద్య0 కోసం గర్భిణీ స్రీలు మరియు వృద్ధులు అనేక అవస్ధలు పడుతున్నారా అని గ్రామస్తులు వేడుకోగా అధికారులు కేవలం ఆటో వెళ్ళడానికి స్థలం వదిలారు. అ మార్గం గుండా పికల బెట్ట గ్రామనికి వెళ్ళడానికి మొత్తం 9 కిలోమీటర్లు అయింది. ఏళ్ల తరబడి కేంద్ర ప్రభుత్వాలు మారిన రాష్ట్ర ప్రభుత్వాలు మారిన పీకల బెట్ట ప్రజల గ్రామా0 ప్రజల తలరాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల స్పందించి రైల్వే ట్రాక్ మీదుగా బ్రిడ్జిని ఏర్పాటు చేసి బస్సు సౌకర్యం కల్పించాలని వాపోయారు.

Mohammad Yousuf

Mohammad Yousuf Reporter, Kosigi, Kurnool DIst
Back to top button