
డి ఏ బకాయిలు వెంటనే చెల్లించాలి – ఆల్ మేవా
- డి ఏ బకాయిలు వెంటనే చెల్లించాలి – ఆల్ మేవా
- ఆల్ మైనారిటీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్
నంద్యాల (ఆంధ్రప్రతిభ) 13 సెప్టెంబర్: డిఏ బకాయిలు ఇంతవరకు అందకపోవడంపై ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. ఎన్నికల ముందు “సకాలంలో డిఏలు అందిస్తాము” అని ఇచ్చిన వాగ్దానాన్ని మరిచి ఇంతవరకు రెండు సార్లు బిల్లులు చేసినప్పటికీ డి ఏ అరియర్స్ జమచేయలేదని ఉద్యోగ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆల్ మేవా నంద్యాల జిల్లా అధ్యక్షులు ఇమ్రాన్ పాషా తెలిపారు. వచ్చే జులై నుండి నూతన పి.ఆర్.సి కాలం సమీపిస్తున్నా ఇంతవరకు గత పిఆర్సి సంబంధిత డిఏలనే మంజూరు చేయలేదని ఫ్రెండ్లీ ప్రభుత్వం అని పలుమార్లు చెప్పే ప్రభుత్వం డిఏ బకాయిలను పెండింగ్ ఉంచకుండా వీలైనంత త్వరగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు అబులైస్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సలీం, నబి రసూల్, సైఫుల్లా, అమీరుద్దీన్ షఫీవుల్లా కలీం ఫయాజుల్లా ఫైరోషాసిధ్ధిఖీ పాల్గొన్నారు