kosigi

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలు మరువలేనివి.

  • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలు మరువలేనివి.
  • వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న మండల ఇంచార్జ్ మురళీమోహన్ రెడ్డి

కోసిగి (పల్లెవేలుగు) 06 డిసెంబర్: రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 66 వర్ధంతి వేడుకలు కోసిగి 1వ గ్రామ సచివాలయం నందు మేజర్ గ్రామ సర్పంచ్ కుమారి అయ్యమ్మ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. వర్ధంతి వేడుకలో పాల్గొని చిత్రపటానికి పూలమలవేసి  నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మురళీమోహన్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సృష్టించిన భారత రాజ్యాంగంను ప్రపంచం నలుమూలల కీర్తించేలా ఘనత  ఆయనకే దక్కిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఈరన్న, మహంతేష్ స్వామి, మాణిక్య రాజు, హోలగుంద కోసిగయ్య, చిన్న బొంపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కడేపాలెం ఎస్సీ కాలనీలో  యువకులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా చిత్ర  పటానికి  పూలమాలవేసి  నివాళులు అర్పించిన అనంతరం విద్యార్థులకు రాజ్యాంగం గురించి చెబుతూ భవిష్యత్ తరానికి నాంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజేష్, లక్ష్మన్న, కడేపాలెం ఎస్సీ యువకులు పాల్గొన్నారు.

Mohammad Yousuf

Mohammad Yousuf Reporter, Kosigi, Kurnool DIst
Back to top button