
టూ టౌన్ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే, డీఐజీ, ఎంపీలు
టూ టౌన్ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే, డీఐజీ, ఎంపీలు
ధర్మవరం (పల్లె వెలుగు) 09 సెప్టెంబర్: పట్టణంలోని జనాభాను దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కావాలని ప్రభుత్వానికి తెలియజేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే టూ టౌన్ పోలీస్ స్టేషన్ ను మంజూరు చేయుటకు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గురువారం పట్టణములో టూ టౌన్ పోలీస్ స్టేషన్ను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, డిఐజి రవి ప్రకాష్, ఎంపీ గోరంట్ల మాధవ్, మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మలాలు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ యొక్క గదులను, రిసెప్షన్ సెంటర్, టూ టౌన్ పరిధిలోకి వచ్చే మ్యాపును ను తదితర వాటిని క్షుణ్ణంగా వారు పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శాంతి భద్రతలను నియంత్రించుటలో రెండవ పోలీస్ స్టేషన్ ఎంతో ప్రాముఖ్యతను సత్కరించుకుంటుందని తెలిపారు. అంతేకాకుండా నేరాల నియంత్రణలో కూడా ఎంతో ఉపయోగ ఉంటుందని, త్వరలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయుటకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. టూ టౌన్ పరిధిలోకి 18 వార్డులు వస్తాయన్నారు. పట్టణములో రైల్వే ట్రాక్ కు అటువైపు ఉన్న వార్డులన్నీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తాయని రైల్వే ట్రాక్ కు ఇటువైపు ఉన్న వార్డులన్నీ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తాయని తెలిపారు. ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన కృషి మరువలేనిదని, ఇది ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. డీఐజీ రవి ప్రకాష్ మాట్లాడుతూ పట్టణ జనాభాకు అనుగుణంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు కూడా మాకు ఎంతగానో సంతోషాన్ని తృప్తిని కలిగించిందన్నారు. ప్రస్తుతం స్టేషన్ కు అవసరమైన సీఐ పోలీస్ సిబ్బందిని కూడా కేటాయించామని, ఇంకనూ ధర్మవరం వన్, ధర్మవరం టూ, రూరల్ పోలీస్ స్టేషన్లలో సిబ్బంది కొరత ఉంటే, తప్పక భర్తీ చేస్తామని తెలిపారు. క్రైమును తగ్గుముఖం పట్టిస్తామని, శాంతి భద్రతల విషయములో కూడా అధికంగా కృషి చేస్తామని తెలిపారు. తదుపరి పక్కనే ఉన్న రూరల్ పోలీస్ స్టేషన్ కూడా పరిశీలించి, తొందరలోనే రూరల్ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో టూటౌన్ సిఐ రాజా, వన్టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం, రూరల్ ఎస్సై ప్రదీప్ కుమార్, వైస్ చైర్మన్లు భాగ్యలక్ష్మి, పెనుజూరు నాగరాజు, మాజీ కౌన్సిలర్ ఉడుముల రామచంద్ర, కౌన్సిలర్లు జయరాం రెడ్డి, మాసపల్లి సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వార్డుల వివరములు
- జి.యస్. కొట్టాల
- శాంతినగర్ ,
- పార్థసారధి నగర్ ,
- వై.యస్.ఆర్. కాలనీ,
- ఇందిరమ్మ కాలనీ, కేతిరెడ్డి కాలనీ,
- యల్ – 1, యల్ – 2,
- యల్ – 3, యల్ – 4 కాలనీలు,
- దుర్గానగర్ ,
- సత్యసాయి నగర్,
- సుందరయ్య నగర్,
- గిరిరాజు కాలనీ,
- మారుతినగర్,
- శివరాంనగర్,
- రాజేంద్రనగర్,
- బాలాజీనగర్,
- లక్ష్మీనగర్,
- టీచర్సు కాలనీ,
- రాంనగర్,
- తారకరామాపురం,
- గుట్ట కింద పల్లి,
మొత్తం వార్డులు – 18