gospadu

జిల్లెల్ల చెన్నకేశవ స్వామి దేవస్థానమునకు గరుడవాహమును బహుకరించిన దాతలు  జిల్లెల్ల పెద్ద నరసమ్మ వారి కుమారులు

జిల్లెల్ల చెన్నకేశవ స్వామి దేవస్థానమునకు గరుడవాహమును బహుకరించిన దాతలు  జిల్లెల్ల పెద్ద నరసమ్మ వారి కుమారులు

గోస్పాడు (పల్లెవేలుగు) అక్టోబర్ 30:  గోస్పాడు మండలం స్థానిక జిల్లెల్ల గ్రామం శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం నందు ఆదివారం రోజు  హైదరాబాదు వాస్తవ్యులు శ్రీ కీర్తిశేషులు జిల్లెల్ల చిన్న బుచ్చప్ప సతీమణి పెద్ద నర్సమ్మ వారి  కుటుంబ సభ్యులు జిల్లెల్ల శేషు, జిల్లెల్ల మురళి, జిల్లెల్లచెన్నకేశవ, జిల్లెల్ల ప్రకాష్ వారి సహాయ సహకారాలతో గరుడ వాహనమును అత్యంత భక్తిశ్రద్ధలతో దేవాలయము సేవకై గరుడ వాహనమును బహూకరించడం జరిగినది. అంతేకాకుండా నంద్యాల పట్టణం స్టేట్ బ్యాంక్ కాలనీ నందు వెలసిన శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత త్యాగరాజ స్వామి దేవస్థానం మరియు నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ నిర్మాణ నిర్వహణ కమిటీ వారి సౌజన్యం తో బాలయ్య దేవతలు కు మహాగణపతికి కిరీటం తొండము అభయహస్తం, శంఖం కలశం, లడ్డు ప్రసాదహస్తం, ఈశ్వరుడికి నాగాభరణం ధారా పాత్ర శతగోపురం, శ్రీ సీతారామ లక్ష్మణ సమేత వారికి కిరీటములు, ఆంజనేయ స్వామి వారికి కిరీటం మకర తోరణం, శ్రీ శిరిడి సాయిబాబా వారికి కిరీటం, మరియు శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత త్రిమూర్తులకు ఉత్సవ పీఠ మకర తోరణం, ధన్వంతరి స్వామివారికి కిరీటం నెమలి పించం మకరతోరణం, సమర్పించుకోవడం విశేషం.  ఈ సందర్భంగా గరుడ వాహన ఉత్సవ ఊరేగింపు, విశేష పూజలతో,   అత్యంత వైభవితంగా భాజా భజంత్రీలతో పురవీధుల గుండా ఆనందం గా భజనలు చేస్తూ, కనుల పండుగగా ఊరేగింపులో పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులు నాయి బ్రాహ్మణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రిటైర్డ్ డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ ఊడుమల్పురం మల్లు గాళ్ళ సుబ్బరాయుడు వీరి సతీమణి  శ్రీశైల దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ శ్రీమతి విజయలక్ష్మి  వారు పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా ఊడు మాల్పురం మల్లుగాళ్ళ సుబ్బరాయుడు, వారు మాట్లాడుతూ, పాలకడలి మధించినప్పుడు అమృత భాండాగారంతో ఉద్భవించిన సాక్షాత్ మహా విష్ణు స్వరూపమైన ధన్వంతరి వంశస్థులైన నాయి బ్రాహ్మణంగా పిలువబడే వీరిని చిన్నచూపుచూసిన యావత్ ప్రపంచానికి అందిస్తున్న వీరి సేవలు అద్భుతం అమోఘం అని కొనియాడారు. అంతేకాకుండా వీరి వంశస్థులు సాక్షాత్ మహావిష్ణు స్వరూపమైన జిల్లెల్ల గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ చెన్నకేశవ స్వామివారికి వాహనమైన గరుడ వాహనాన్ని సమర్పించుకోవడం మహోన్నత కార్యమని, ఇలాంటి మహోన్నతమైన భగవత్ పుణ్య కార్యక్రమంలో పాల్గొనడం నా మా పూర్వజన్మ సుకృతం అదృష్టంగా  భావిస్తున్నామని, ఈ మహత్కార్యానికి గరుడ వాహనాన్ని సమర్పించిన కీర్తిశేషులు జిల్లెల్ల బుచ్చప్ప వారి సతీమణి పెద్ద నరసమ్మ వారి కుటుంబ సభ్యులందరికీ భగవంతుడు ఆయురారోగ్యాలు,  అష్టైశ్వర్యాలు,ధన కనక వంశాభివృద్ధి వస్తు వాహన  సంప్రాప్తి, వంశాభివృద్ధి చెంది, నిండు నూరేళ్లు వర్ధిల్లాలని,అంతేకాకుండా ఇక్కడికి విచ్చేసి ఈ భగవత్ కార్యంలో పాల్గొన్న  భక్తులందరూ పుణ్యం చేసిన వారిని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తులందరికీ  పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం చైర్మన్ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు భజన బృందము తదితరులు పాల్గొన్నారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button