nandyala

 జిల్లా పురుషుల సీనియర్ హ్యాండ్ బాల్ జట్టు ఎంపిక

 జిల్లా పురుషుల సీనియర్ హ్యాండ్ బాల్ జట్టు ఎంపిక

నంద్యాల (పల్లెవేలుగు) 12 డిసెంబర్: రాష్ట్రస్థాయి సీనియర్ హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టు ఎంపిక పోటీలు సోమవారం నిర్వహించారు. జిల్లా హ్యాండ్ బాల్ సంఘం ప్రతినిధులు మహబూబ్ బాషా, రామేశ్వర్ రెడ్డిల ఆధ్వర్యంలో జిల్లా పురుషుల హ్యాండ్ బాల్ జట్టు ఎంపిక పోటీలు నంద్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి దాదాపు 40 క్రీడాకారులు పాల్గొన్నారని వారు తెలిపారు.ఎంపికైన జిల్లా పురుషుల హ్యాండ్ బాల్ జట్టు ఈనెల 18 ,19 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే 51వ రాష్ట్రస్థాయి పురుషుల హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలో పాల్గొంటుందని వారు తెలిపారు

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button