Dharmavaram

జింక అమరేష్ మృతి తీరని లోటు.. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి

జింక అమరేష్ మృతి తీరని లోటు.. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి

ధర్మవరం (పల్లె వెలుగు) : జనసేన పార్టీ చేనేత విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జింక అమరేష్ మంగళవారం చిత్రావతి నదిలో జారిపడి మృతి చెందడం బాధాకరమని పార్టీకి తీరని లోటు అని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో గల మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతూ జనసేన పార్టీ ఎల్లప్పుడు మీకు అండగా ఉంటుందని తెలిపారు. కుటుంబాన్ని జనసేన పార్టీ ఆదుకుంటుందని తెలిపారు. చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించుటలో మృతుడు జింక  అమరేష్ ఎనలేని సేవలను అందించాలని తెలిపారు. నిరంతరం చేనేత కార్మికుల సమస్యకు సమస్యలపై నాతోనూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో చర్చించిన విషయాలు చాలా ఉన్నాయని తెలిపారు. అనంతరం సిపిఐ ఏపీ చేనేత కార్మిక సంఘం  ప్రధాన కార్యదర్శి జింక చలపతి మాట్లాడుతూ మృతుడు మాకు బంధువులు అవుతారని, అతని మృతి కుటుంబానికి ఎంతో తీరని లోటు అని, ఇంత చిన్న వయసులో భగవంతుడు తన సన్నిధికి చేర్చుకోవడం బాధాకరమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బెస్త శ్రీనివాసులు, చంద్రశేఖర్ ,నాగేంద్ర, అబ్దుల్, రామాంజనేయులు, శ్యాం కుమార్ తదితరులు పాల్గొన్నారు.

chiranjeevi

Chiranjeevi Reporter,Dharmavaram, Satyasai District
Back to top button