nandyala

జాతీయస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ బాలికల జట్టు

జాతీయస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ బాలికల జట్టు

నంద్యాల (పల్లెవేలుగు) 15 డిసెంబర్: 37వ జాతీయస్థాయి సబ్ జూనియర్ బాలికల హ్యాండ్ బాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు పాల్గొంటుందని రాష్ట్ర హ్యాండ్ బాల్ సంఘం ఆర్గనైజర్ సెక్రెటరీ రామాంజనేయులు తెలిపారు. బీహార్ రాష్ట్రంలోని సారాన్ జిల్లాలో ఈనెల 14 నుంచి 18వ తేదీ వరకు హ్యాండ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణ లో బీహార్ రాష్ట్ర హ్యాండ్ బాల్ సంఘం ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు అన్నారు.జాతీయ స్థాయిలో పాల్గొనే రాష్ట్ర బాలికల జట్టు ను ప్రకటించారు. రాష్ట్ర జట్టులో షర్మిల,అక్షయ కీర్తి ,పావని రాణి,జాస్మిన్ ,కరీనా బేగం ,హర్షిత, వందన, నక్షత్ర ,వెంకట లావణ్య, చందన, పూజిత ,రెడ్డి చైతన్య, హన్సిక, శ్రీలక్ష్మి, తనుజ, ప్రీతి రోజ్ లు పాల్గొంటారన్నారు. రాష్ట్ర జట్టు శిక్షకులుగా రాజకుమార్ రెడ్డి ,మేనేజర్ గా సునీతల వ్యవహరిస్తారు అన్నారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button