
kosigi
జాతిపిత మహాత్మా గాంధీ 153 జయంతి వేడుకలు
జాతిపిత మహాత్మా గాంధీ 153 జయంతి వేడుకలు
కోసిగి (పల్లెవేలుగు) 02 అక్టోబర్: గ్రామ మేజర్ పంచాయితి కార్యాలయం నందు సర్పంచ్ అయ్యమ్మ ఆధ్వర్యంలో గ్రామ సభ ఏర్పాటు చేసి 153వగాంధీ జయంతి మరియు లాల్ బహుదూర్ శాస్త్రి 118 జయంతి ఉత్సవాలు జరుపుకున్నారు. గ్రామ స్వరాజ్యానికి అహర్నిశలు కృషి చేస్తూ గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని జాతిపితని గుర్తు చేస్తూ కొనియాడారు గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి స్మరించుకున్నారు. వార్డ్ మెంబర్ సీపీఐ రాముడు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు ఆదినారాయణ శెట్టి, షంషుద్దీన్, రాజేష్, గుమస్తా విజయ్ కుమార్, బిల్ కలెక్టర్ గాయత్రి, చింతమ్మ, పిఎస్ అనురాధ పాల్గొన్నారు.