kosigi

జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి?

  • జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి?
  • పత్తికొండలో జర్నలిస్టుపై జరిగిన దాడి హేమమైన చర్య

కోసిగి (పల్లెవేలుగు) 11 అక్టోబర్: కర్నూలు జిల్లా పత్తికొండలో ABN ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్  పక్కిరప్ప పై దాడి చేసిన  దుండగులను వెంటనే అరెస్టు చేసి రిమాండ్ పంపాలని ఏపీయూడబ్ల్యూజె జిల్లా సహాయ కార్యదర్శి బి. హనుమేష్ ప్రభుత్వం ను డిమాండ్ చేస్తూ వారి ఆధ్వర్యంలో ఏపీయూడబ్ల్యూజే మంత్రాలయం కమిటీ నాయకులు శ్రీరామ్ షబ్బీర్ అధ్యక్షతన కోసిగిలో తాసిల్దార్ కార్యాలయం ముందు ప్లకార్డులు తో జర్నలిస్టులతో కలిసి నిరసన వ్యక్తం చేసి  వినతిపత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లేది జర్నలిస్టు వృత్తి అని అలాంటి వృత్తిలో సేవలు అందించే జర్నలిస్టులపై దాడులు జరగడం హేమమైన చర్య అని ఖండించారు. జర్నలిస్టుపై దాడి చేయడం సమజానికే సిగ్గు చేటని మండిపడ్డారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత జర్నలిజానికి మరింత గౌరవం పెరుగుతుందని ఆశించాముకానీ దురదృష్టవశాత్తు సమాజంలోని కొన్ని దుష్ట శక్తులు జర్నలిస్టులపై దాడి చేయడం సమజానికే చెడ్డపేరు వస్తుందని తెలిపారు. ఇప్పటికైనా సేవా భావంతో పనిచేసే జర్నలిస్టులపై దాడులు జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోని దాడులకు పాల్పడిన వారిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేయాలని  డిమాండ్ చేశారు.

Mohammad Yousuf

Mohammad Yousuf Reporter, Kosigi, Kurnool DIst
Back to top button