Dewanakonda

జర్నలిస్టుల హక్కుల కోసం సమిష్టిగా పోరాడుదాం రాయలసీమ జర్నలిస్ట్ ఫోరం

  • జర్నలిస్టుల హక్కుల కోసం సమిష్టిగా పోరాడుదాం రాయలసీమ జర్నలిస్ట్ ఫోరం
  •  రాయలసీమ జర్నలిస్ట్ ఫోరం నూతన కమిటీ
  • నూతన కమిటీతో యువ జర్నలిస్టులో ఉత్సాహం

దేవనకొండ (ఆంధ్రప్రతిభ) నవంబర్ 25 మండల కేంద్రంలోని స్థానిక సిఎల్ఆర్ సి భవనంలో రాయలసీమ జర్నలిస్ట్ ఫారం నూతన కమిటీ గురువారం రోజు నిర్వహించడం జరిగింది. రాయలసీమ జర్నలిస్ట్ ఫారం రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, జిల్లా నాయకులు ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్ జెఎఫ్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ జర్నలిస్ట్ హక్కులకు కోసం సమిష్టిగా పోరాడుదాం అని వారు పిలుపునిచ్చారు. అలాగే ప్రతి ఒక్క జర్నలిస్ట్ జర్నలిస్టుల సమస్యలపై అనునిత్యం పోరాటం చేయాలని వారు అన్నారు. అలాగే విలేకరుల సంఘం గౌరవ అధ్యక్షులుగామహేశ్వర రెడ్డి, మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ శెట్టి, ప్రధాన కార్యదర్శి తిరుపాల్,ఉపాధ్యక్షులు సి.బాబు, చింతమను రంగన్న, రాఘవేంద్ర సహాయ కార్యదర్శి యాకోబు, భీమ, నరసనాయుడు, ట్రెజరరి చిన్న, ఈసీ నెంబర్ కుక్కల వెంకటేష్ మీడియా కన్వీనర్ రంగస్వామి కమిటీ సభ్యులు ప్రతాప్ నాయుడు, నరసింహులు, కృష్ణ, రామకృష్ణ, జియావుల్, బాల తేజ, జయ చంద్ర, ధనుంజయ ఎన్నికైన వారిని రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శులు, జిల్లా నాయకులు మండల కమిటీ సభ్యులకు పూలమాల, శాలువాతో సన్మానిం చారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ దేవనకొండ మండల విలేఖరుల సమస్యలను పరిశీలించి వాటి పరిష్కారమే ధ్యేయంగా కృషి చేస్తామని తెలిపారు.

Back to top button