nandyala

జమాన్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం – ఎమ్మెల్సీ

జమాన్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం – ఎమ్మెల్సీ

నంద్యాల (పల్లెవెలుగు) 30 డిసెంబర్: ఆవో ఉర్దూ సిఖే  కరపత్రం విడుదల సందర్భంగా స్థానిక ఎమ్మెల్సీ ఆఫీసు నందు జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ ఇసాక్ భాషా మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో జమాన్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న వివిధ సామాజిక కార్యక్రమాలు ఎంతో అభినందనీయం అని అన్నారు. ముఖ్యంగా ఆవో ఉర్దూ సిఖే కార్యక్రమం ద్వారా అందరూ ఉర్దూ భాషను సులభంగా నేర్చుకునే అవకాశం ఉందని అన్నారు.  మన రాష్ట్ర ప్రభుత్వం ఉర్దూ భాషను రెండవ అధికార భాష చేయడం ద్వారా మనం అందరం తప్పనిసరిగా నేర్చుకునే సమయం ఆసన్నమైందన్నా జమాన్ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు, మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా స్థానిక నవభారత్ హై స్కూల్ నూనెపల్లె ఆవరణలో ప్రతి ఆదివారం ఉచితంగా ఉర్దూ నేర్పించుటకు ఏర్పాట్లు చేయడం అయినది అని అన్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మరియు కాలేజీలలోచదువుచున్న స్టూడెంట్స్ తో పాటు ఉర్దూ భాష నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. నవభారత్ హై స్కూల్ కర్రీస్పాండెంట్ ఎస్.ఎం.డి. హుస్సేన్ మాట్లాడుతూ ఈ తరగతులు జనవరి నెల15 వ తేదీ నుండి ప్రారంభమవుతాయని ఆసక్తి గలవారు తమ తమ పేర్లను ఇవ్వబడిన ఫోన్ నెంబర్లకు వాట్స్అప్ ద్వారా నమోదు చేసుకోవాలని కోరడం జరిగింది. తరగతులకు హాజరవుతున్న ప్రతి ఒక్కరికి మెటీరియల్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆల్మేవ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అబులైస్, కౌన్సిలర్ ఆరిఫ్ నాయక్, నంద్యాల ముస్లిం జేఏసీ నాయకులు అతావుల్లా ఖాన్ ప్రముఖ న్యాయవాది నూర్ అహ్మద్ మదని రూటా రాష్ట్ర నాయకులు కలీం షఫీ ఉల్లా, హనీఫ్, జానీ భాష నేషనల్ హై స్కూల్ రూట నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ దస్తగిరి భాష, కరస్పాండెంట్ ఖాజా హుస్సేన్, పర్వేజ్ నియాజీ తోపాటు జమాన్ ఫౌండేషన్ మరియు ఉపాధ్యాయులు  రూట నాయకులు పాల్గొన్నారు

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button